ఓ వైపు 2019 వరల్డ్ కప్ సందడి.. మరోవైపు 1983 వరల్డ్ కప్ సందడి! ఈ రెండిటికీ కేంద్రం అయ్యింది ఇంగ్లండ్. అయితే ఒకటి లైవ్ క్రికెట్. ఇంకొకటి షూటింగ్ పర్పస్ ఆడుతున్న క్రికెట్. ఇంతకీ మ్యాటరేమంటే..
ప్రస్తుతం రణవీర్ సింగ్ ప్రధాన పాత్రధారిగా 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాడు వెస్టిండీస్ పై ఫైనల్ మ్యాచ్ గెలిచిన టీమిండియా వైభవాన్ని వెండితెరపై చూపించబోతున్నారు. రణవీర్ టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్నాడు. నాటి అసాధారణ విక్టరీని .. దాని వెనక ఉన్న ఎమోషన్ ని సినిమా రూపంలో నేటి జనరేషన్ కి కళ్లకు గట్టేలా చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. ఇందులో కీలక సన్నివేశాల చిత్రీకరణకు ప్రస్తుతం వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతున్న ఇంగ్లండ్ నే వేదికగా ఎంచుకోవడం ఆసక్తికరం.
ఆ క్రమంలోనే రణవీర్ సింగ్ బృందం ఇంగ్లండ్ వెళ్లింది. 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయిపోయిన అనంతరం.. 83 మూవీ క్లైమాక్స్ సన్నివేశాల్ని ఇంగ్లండ్ లార్డ్స్ మైదానంలో తెరకెక్కించనున్నారు. 1983 విక్టరీని తిరిగి 2019 వరల్డ్ కప్ లో రిపీట్ చేసేందుకు ఇంగ్లండ్ లో కోహ్లీ సేన రెడీగా ఉన్న నేపథ్యంలో అదే చోట 83 చిత్రీకరణ సాగుతుండడం యాథృచ్ఛికం.. ఆసక్తికరం. నాడు కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా లార్డ్స్ మైదానంలో గెలిచి సత్తా చాటింది. నేడు కోహ్లీ సేన కూడా దానిని రిపీట్ చేయాలని కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు. అలాగే ఈ వరల్డ్ కప్ వేదికను 83 ప్రచారానికి రణవీర్ సింగ్ టీమ్ ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదివరకూ ఇండియా- పాక్ మ్యాచ్ కి ముందు రణవీర్ కామెంటేటర్ గానూ కొనసాగారు.