డాకు నుంచి మోత మోగించే టాకు..!
నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా సంక్రాంతికి వస్తుంది అంటే తప్పకుండా సూపర్ హిట్ కొట్టినట్టే లెక్క.
నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా సంక్రాంతికి వస్తుంది అంటే తప్పకుండా సూపర్ హిట్ కొట్టినట్టే లెక్క. అక్కడ పొటీ ఎవరొచ్చినా సరే విజయం మాదే అన్న ధైర్యం నందమూరి ఫ్యాన్స్ లో కూడా ఉంటుంది. ఈమధ్య వరుస సక్సెస్ లతో అదరగొడుతున్న బాలయ్య బాబు డాకు మహారాజ్ తో మరో సూపర్ హిట్ టార్గెట్ తో వస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాను బాబీ డైరెక్ట్ చేశాడు. సినిమాలో అందాల భామలు ఊర్వశి రౌతెల, శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ లు నటించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12 అంటే రేపు ఆదివారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా. సినిమా నుంచి ఆమధ్య వచ్చిన ట్రైలర్ అంచనాలు పెంచగా లేటెస్ట్ గా రిలీజైన రిలీజ్ ట్రైలర్ కూడా భారీ హైప్ తెచ్చింది. బాలయ్య లో ఊర మాస్ ని తన డైరెక్షన్ లో నెక్స్ట్ లెవెల్ లో చూపించే ప్రయత్నం చేశాడు బాబీ. అందుకే డాకు మహారాజ్ లుక్కే అదిరిపోయింది.
ఇక సినిమాకు థమన్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ గా నిలిచేలా ఉంది. బాలయ్య డాకు మహారాజ్ రిలీజ్ మరికొద్ది గంటలు ఉంది అనగా సినిమా నుంచి కొన్ని ఎక్స్ క్లూజివ్ అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా డాకు మహారాజ్ సినిమా ఇంటర్వెల్ సీన్ ఐతే నెక్స్ట్ లెవెల్ అంటూ చెబుతున్నారు. సినిమా ఇంటర్వెల్ సీన్ తోనే హిట్ టాక్ వచ్చేస్తుందని బాబీ ఆ రేంజ్ లో ఆ ఎపిసోడ్ ప్లాన్ చేశాడని తెలుస్తుంది.
బాబీ ముందు నుంచి డాకు మహారాజ్ యాక్షన్ సీన్స్ పై ప్రత్యేకంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంటర్వెల్ సీన్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఈ బ్లాక్స్ లో యాక్షన్ సీన్స్ అదిరిపోతాయని తెలుస్తుంది. పవర్ నుంచి తన డైరెక్షన్ లో మాస్ ఎపిసోడ్స్ ని వేరే రేంజ్ లో తీస్తున్న బాబీ డాకు మహారాజ్ ని కూడా అదే రేంజ్ లో కాదు కాదు అంతకుమించి అనిపించేలా చేశాడని తెలుస్తుంది. మరి డాకు మహారాజ్ రిలీజ్ కి మరికొద్ది గంటలు ఉన్న ఈ టైం లో బయటకు వస్తున్న ఈ టాక్ చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అనిపించేలా ఉంది. మరి రిజల్ట్ ఏమవుతుంది అన్నది మరో 10-12 గంటల్లో తెలుస్తుంది.