బంద్ తో వారికి చెక్ పెట్ట‌బోతున్నారా?

Update: 2022-08-05 01:30 GMT
టాలీవుడ్ బంద్ వ‌ల్ల కొత్త కొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయా? అంటే ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. గ‌త కొంత కాలంగా స్టార్ హీరోల పారితోషికాలు చుక్క‌ల నంటాయి. అదే స్థాయిలో నిర్మాణ వ్య‌యం కూడా పెరిగిపోయింది. వీటికి తోడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు కూడా త‌మ ద‌ర్జా చూపించేస్తున్నారు. పెరిగిన నిర్మాణ వ్య‌యం, ఆర్టిస్ట్ ల పారితోషికాలు, ఓటీటీ ల కార‌ణంగా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రాని ప‌రిస్థితి.

అంతే కాకుండా ప్రేక్ష‌కుల్లో అత్య‌ధిక శాతం థియేట‌ర్ల‌కు రాక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం టికెట్ రేట్లు పెర‌గ‌మే. అయితే ఈ స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టిన నిర్మాత‌లు ఆగ‌స్టు 1 నుంచి ప‌లు కీల‌క అంశాల‌పై భేటీ అవుతూనే వున్నారు. చ‌ర్చ‌లు జ‌రుపుతూనే వున్నారు. కీల‌క స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధానంగా క‌మీటీల‌ని నియిమిస్తూ ముందుకు సాగుతున్నారు.

గురువారం కూడా ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై భేటీ అయ్యారు. నాలుగు కీల‌క అంశాల‌పై క‌మీటీని ఏర్పాటు చేశామ‌ని ఆ స‌మ‌స్య‌ల‌పై క‌మిటీ త‌న ప‌ని తాను చేస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఇండ‌స్ట్రీలో ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్లో ఒక‌టిగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల స‌మ‌స్య మారింద‌ని తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ముందు నుంచి చాలా మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు గంట‌లు, రోజుల లెక్క‌న పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారంటూ వార్త‌లు వినిపించాయి.

అయితే తాజాగా వారి పేర్లే ఏకంగా బ‌య‌టికి రావ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల జ‌రిగిన నిర్మాత‌ల మీటింగ్ లోల ప్ర‌ధానంగా కొంత మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల పేర్లు ప్ర‌ధానంగా వినిపించాయ‌ట‌. అందులో ముర‌ళీశ‌ర్మ‌, రావు ర‌మేష్ ల పేర్లు ముందు వ‌రుస‌లో వున్నాయ‌ని చెబుతున్నారు. తండ్రి, మామ వంటి క్యారెక్ట‌ర్ ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచారు. చాలా వ‌ర‌కు ప్ర‌తీ సినిమాలో వీరు ఉండాల్సిందే. వీరు రోజుకు రూ. 5 ల‌క్ష‌లు వ‌సూలు చేస్తున్నార‌ట‌. ఇక వీరు షూటింగ్ స్పాట్ కు రావ‌డానికి ప్ర‌త్యేకంగా కారు. అదే కాకుండా స్పెష‌ల్ గా కార‌వాన్ కూడా వుండాల్సిందే.

అంతే కాకుండా వీరి అస్టిస్టెంట్ ల‌కు కూడా ప్ర‌త్యేకంగా చెల్లించాల్సిందేన‌ట. ఈ ఖ‌ర్చులు ఇక నుంచి భ‌రించ‌లేమ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన నిర్మాత‌లు చాలా మంది ఈ ఇద్ద‌రితో పాటు చాలా మంది వీరి త‌ర‌హాలో ఇబ్బందిగా మారిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల‌కు నిర్మాత‌లు చెక్ పెట్టాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా ఇంద్ద‌రు స్టార్ హీరోల‌పై కూడా క‌న్నేసిన‌ట్టు ఇన్ సైడ్ టాక్‌.

పాన్ ఇండియా మూవీస్ చేయ‌క‌పోయినా ఆ రేంజ్ లో పారితోషికాలు వ‌సూలు చేస్తున్నార‌ని ఇక‌పై ఆ స్థాయిలో పారితోషికాల‌ని ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఆ హీరోలు ఎవ‌రు?  క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల‌ని తాజా నిర్ణ‌యంతో నిర్మాత‌లు క‌ట్ట‌డి చేస్తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News