బాలీవుడ్ కి టాలీవుడ్ హీరోలు ఇలా కూడా షాకిస్తున్నారా?

Update: 2022-09-05 08:21 GMT
సౌత్ ఇండ‌స్ర్టీ అంటే ఇప్ప‌టికే బాలీవుడ్ వెన్నులో ఒణుకు మొద‌లైంది. పాన్ ఇండియ  లో ద‌క్షిణాది..తెలుగు చిత్రాలు హ‌డా చాట‌డంతో బాలీవుడ్ కి దిమ్మ‌తిరిగిపోయింది. సౌత్ కంటెంట్ హిందీ లో రీమేక్ అవ్వ‌డం..అక్క‌డా స‌క్సెస్ అందుకోవ‌డంతో సీన్ ఒక్క‌సారిగా మారింది. గొప్ప‌లు తిప్ప‌లు పోయేహిందీ వాళ్లంతా ఇండియాన్ సినిమా అంటూ అంద‌ర్నీ క‌లుపుస‌కోవ‌డం మొద‌లైంది.

ఇక తెలుగు నుంచి ప్ర‌భాస్..రానా...రామ్ చ‌ర‌ణ్‌...బ‌న్నీ...ఎన్టీఆర్ లాంటి హీరోలు పాన్ ఇండియాలో ఫేమ‌స్ అవ్వ‌డంతో వాతావ‌ర‌ణం మ‌రింత వెడెక్కింది. ఈ హీరోల్ని బాలీవుడ్ ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు త‌మ ప‌రిశ్ర‌మ‌కి తీసుకోవాల‌ని వెయిట్ చేస్తున్నారు. దీనంత‌టికి కార‌ణం ఆయాస్టార్స్  క్రేజ్ ఒక్క‌టే కార‌ణం. ఇది కాస్త హిందీ హీరోల‌కి మింగుడు ప‌డ‌ని వార్త అనే అనాలి.

అయితే తాజాగా మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌ట్లు ఓ స‌న్నివేశం క‌నిపిస్తుంది. కార్పోరేట్ కంపెనీలు ఇప్పుడు హిందీ హీరోల‌కంటే సౌత్ హీరోల‌తోనూ..అందులోనూ తెలుగు హీరోల‌తో ఎక్కువ‌గా త‌మ బ్రాండ్స్ ని ప్ర‌మోట్ చేయ‌డం కోసం ఆస‌క్తి చూపించ‌డం విశేషంగా చెప్పొచ్చు. ఒక‌ప్పుడు ఈ హీరోలంతా తెలుగు మార్కెట్ వ‌ర‌కే ప‌రిమితం.

కానీ నేడు స‌న్నివేశం మ‌రోలా క‌నిపిస్తుంది. ఈ ఏడాది బ‌న్నీ ఇప్ప‌టికే బోలెడ‌న్ని క‌మ‌ర్శియ‌ల్ యాడ్స్ చేసాడు. పాన్ ఇండియా  వైడ్ అవి రిలీజ్ అవుతున్నాయి. హిందీ హీరోల్ని కాద‌ని ఈ యాడ్స్ బ‌న్నీ వ‌ర‌కూ వ‌చ్చాయి. ఇటీవ‌లే ఓ పాన్ మ‌సాలా యాడ్ ని బ‌న్నీ తిర‌స్క‌రించాడు. దీంతో ఆ యాడ్ ని సౌత్ లోనే మ‌రో హీరోతో చేయించుకుంటున్నారు.

ఇక బ‌న్నీ కంటే ముందే సూప‌ర్ స్టార్ మ‌హేష్ పాన్ ఇండియా వైడ్ క‌మ ర్శియ‌ల్స్ లో  పాగా వేసేసిన సంగ‌తి తెలిసిందే. హిందీ లో ఒక్క సినిమా కూడా చేయ‌కుండానే మ‌హేష్ తో ప్ర‌ఖ్యాత కార్పోరేట్ కంపెనీలు  మ‌హేష్ తో యాడ్స్  చేసాయి. మ‌హేష్  త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి వేగాన్ని బ‌న్నీ అందుకుంటున్నాడు. ఇక రామ్ చ‌ర‌ణ్ ..ఎన్టీఆర్ సైతం అదే దూకుడు చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అలాగే డార్లింగ్ ప్ర‌భాస్ ఒకే చెప్పాలే గానీ ..అత‌నితో యాడ్స్ చేసేందుకు  బ‌డా కంపెనీలన్నీ క్యూలో ఉంటాయి. ఒక‌ప్పుడు ఇదే దూకుడు హిందీ హీరోలు బ్రాండింగ్స్ లో చూపించే వారు. రెండేళ్ల‌గా  బాలీవుడ్  ఫామ్ లో లేక‌పోవ‌డం స‌హా క్రేజ్ దృష్ట్యా వెనుక‌బాటు త‌నం సౌత్..తెలుగు హీరోలు ముందంజ‌లో క‌నిపిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News