అక్కినేని హీరోల్లో ఇంతవరకూ మాస్ ఫాలోయింగ్ ఉన్నసరైన నటులు లేరు. అక్కినేని కుటుంబం నుంచి రెండవ తరం ప్రారంభమైన ఇంకా మాస్ ఫాలోయింగ్ దక్కించుకోవడంలో వెనుకబడే ఉన్నారు. లెజెండరీ నటుడు ఏఎన్నార్ దగ్గర నుంచి చైతన్య..అఖిల్ వరకూ అందరూ లవర్ బోయ్ ఇమేజ్ తోనే పరిశ్రమలో రాణిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీని ఎంతో కాలంగా ఈ రకమైన అసంతృప్తి వెంటాడుతుంది.
అందుకే ఎలాగైనా నాగ చైతన్యని మాస్ ఫాలోయింగ్ హీరోని చేయాలని నాగార్జున కెరీర్ ఆరంభంలో ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఫలించలేదు. మాస్ అటెంప్ట్స్ ఏవీ ఆ హీరోకి కలిసి రాలేదు. అఖిల్ విషయంలో ఇంకా ఆ రకమైన తొందరపాటు కనిపించలేదు. బ్యాచిలర్ తో సిసలైన సక్సెస్ అందుకున్న అఖిల్ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు.
కాస్త స్థిరత్వం వచ్చిన తర్వాత సింసిద్రీ విషయంలోనూ కింగ్ అలాంటి నిర్ణయాలతో ముందుకెళ్లే అవకాశం ఉంది. అయితే అంతకు ముందే నాగచైతన్యని మాస్ హీరోగా చేయాలి. ఈ నేపథ్యంలో ఆరకమైన ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయా? ఆ బాధ్యతలు మళ్లీ రాజుగారే తీసుకుంటున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. చైతన్య హీరోగా పరిచయం అయింది దిల్ రాజు బ్యానర్లోనే అన్నది తెలిసిందే.
'జోష్' తో నే యూత్ సహా మాస్ ఆడియన్స్ కి దగ్గర చేయాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో మళ్లీ లాంగ్ గ్ యాప్ తర్వాత అదే హీరోతో 'థాంక్యూ' చిత్రాన్ని నిర్మించారు రాజుగారు . ఇటీవలే ఆ సినిమా విడుదలై ప్రతికూల ఫలితాలు అందుకుంది. ఆ రకంగా రెండు సినిమాలు చైతన్య-దిల్ రాజుని తీవ్ర నిరుత్సాహనికి గురిచేసాయి.
చై సంగతి పక్కనబెడితే అక్కినేని వారసుడికి సరైన హిట్ ఇవ్వలేదు అన్న పెయిన్ రాజుగార్ని రోజు వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాజుగారు మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో చైతో సినిమాకి రెడీ అవుతున్నారా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. 'థాంక్యూ' ప్రచార సమయలోనే చైతన్యతో ఓ ఊర మాస్ సినిమా చేసి హిట్ ఇస్తానని రాజుగారు ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడా మాట దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. చైతన్య కోసం ఓ మాస్ కథని కొంత మంది రైటర్లచే రెడీ చేయిస్తున్నారట. నెవెర్ బీఫోర్ అనేలాగే ఈ కథ ఉంటుందని..అంత కమిట్ మెంట్ తో కథ సిద్దం చేయాలని రచయితల్ని కోరినట్లు తెలిసింది. చైతన్య ఇమేజ్ ని ..మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని అన్నిరకాలుగా బ్యాలెన్స్ అయ్యేలా కథ ఉండాలని..అందుకోసం ఏడాది సమయం ఇచ్చారని సమాచారం. మరి ఆ రచయితల టీమ్ ఎవరు? అన్నది తెలియాల్సిన అంశం. కేవలం కథ సిద్దం చేయడం వరకే ఆ రచయితల్ని పరిమితం చేస్తారా? దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది తెలియాలి. ఏదీ ఏమైనా చైతన్యకి మాత్రం మాస్ హిట్ ఇచ్చే వరకూ రాజుగారు నిద్రపోయేది లేదన్నది వాస్తవం.