గోదావరి సైడ్ మాస్ కుర్రాళ్ల రచ్చ మామూలుగా లేదే!

Update: 2021-12-20 04:01 GMT
మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. యువ హీరోల్లో తనదైన ప్రత్యేకతను చాటుతున్నాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'రాజ రాజ చోర' సినిమా హిట్ అయింది. నటుడిగా శ్రీవిష్ణును ఈ సినిమా మరో మెట్టు ఎక్కించింది.

ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి ఈ నెల 31వ తేదీన రావడానికి 'అర్జున ఫల్గుణ' రెడీ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో .. స్నేహం గొప్పతనాన్ని చాటే ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మించాడు. ఈ సినిమాతో దర్శకుడిగా తేజ మార్ని పరిచయమవుతున్నాడు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన నేపథ్యాన్ని శ్రీవిష్ణుతో చెప్పిస్తూ .. 'మేకింగ్ డైరీస్' పేరుతో ఒక వీడియోను వదిలారు. ప్రమోషన్స్ లో ఇది ఒక కొత్త ప్రయత్నమని చెప్పుకోవాలి. ఈ కథ ఏ లైన్ ను పట్టుకుని నడుస్తుందనేది శ్రీవిష్ణు చెబుతుంటే, అందుకు సంబంధించిన మేకింగ్ షాట్స్ ను చూపించడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది.

శ్రీవిష్ణు చెప్పిన వాయిస్ ఎలా ఉందనే విషయానికి వెళితే .. "ఇది ఫ్రెండ్షిప్ మీద నడిచే స్టోరీ .. మన అమ్మమ్మగారి ఊళ్లో గానీ .. నాయనమ్మగారి ఊళ్లో గాని వచ్చే కేరక్టర్స్ ను గుర్తుచేసే సినిమా ఇది .. అలాంటి రోజులన్నీ గుర్తొస్తాయి.

కథను తయారు చేయడానికి ఎక్కువ కష్టపడలేదు .. ఎందుకంటే నిజంగా ఇది జరిగిన కథనే. యధాతథంగా చూపించడానికి ట్రై చేశామే గానీ .. కథను ఒక ఇంచు కూడా మార్చలేదు. జన్యున్ స్టోరీ .

ఒరిజినల్ స్టోరీ .. అక్కడ రియల్ గా జరిగిన స్టోరీ. దానిని స్క్రీన్ పైకి ట్రాన్స్ఫర్ చేశామంతే" అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్రను పోషించిన అమృత అయ్యర్ తో పాటు ఇతర నటీనటులు మాట్లాడుతూ .. "గోదావరి సైడ్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? వాడు మన ఇంటికి వస్తే మన అమ్మ వాడిని ఎలా చూస్తుందో, వాడి ఇంటికి మనం వెళ్లినప్పుడు కూడా వాళ్లమ్మ మనని అలాగే చూస్తుంది.

ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా అదే ఫీలింగ్ తో నడుస్తుంది .. మీరు అదే ఫీలింగ్ తో చూస్తారు. ఇది ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్. ఇందులో కావలసిన కామెడీ .. యాక్షన్ .. ఎమోషన్స్ ఉంటాయి. ఒక ఐదుగురు ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ కి కష్టం వస్తే, మిగతావాళ్లు ఎంతదూరమైనా వెళ్లడానికి సిద్ధపడతారు.

అలా ఒక స్నేహితుడిని కాపాడటం కోసం వాళ్లు ఏం చేశారు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఎలా ఆ స్నేహతుడిని రక్షించారు? అనేదే కథ. ఈ విషయాలన్నిటికీ ఎలా ఆవిష్కరించడం జరిగిందనేది మీరు బిగ్ స్క్రీన్ పై చూడండి" అని చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News