బాలీవుడ్ స్టార్ నటుడు అర్జున్ కపూర్ కెరీర్ ఆరంభంలో లుక్స్ పరంగా ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు నటనకు మంచి మార్కులు దక్కించుకున్నాడు. కాని కాల క్రమేనా అర్జున్ కపూర్ కాస్త బరువు పెరగడంతో పాటు ఫేస్ లో డల్ నెస్ ఎక్కువగా కనిపిస్తుంది అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. సోషల్ మీడియాలో అర్జున్ కపూర్ గురించి రకరకాలుగా కామెంట్స్ వచ్చాయి
బరువు పెరగడంతో పాటు కాస్త పొట్ట కూడా వచ్చినట్లుగా కనిపించడంతో చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యలు చేయడంతో అర్జున్ కపూర్ ఛాలెంజ్ గా తీసుకుని బరువు తగ్గాడు. కేవలం ఏడాది గ్యాప్ లోనే తన ఫిజిక్ ను పూర్తిగా మార్చేసుకున్నాడు. పొట్ట మరియు సైడ్ ల్లో ఉన్న కొవ్వు కరిగించడం ద్వారా ఏకంగా సిక్స్ ప్యాన్ ను అర్జున్ కపూర్ ట్రై చేసి సక్సెస్ అయ్యాడు అని ఈ ఫోటో చూస్తుంటే అర్ధం అవుతుంది.
గత ఏడాది ఫిబ్రవరిలో తీసుకున్న ఫోటోలో అర్జున్ కపూర్ కండలు లూజ్ గా.. పొట్ట మరియు పొట్టకు పక్కన కొవ్వు పట్టి ఉంది. కాని ఇప్పడు మే 2022 ఫోటోలో మాత్రం ఎంత ఫిట్ గా ఉన్నాడో అర్థం అవుతుంది. కష్టపడి ఏదైనా సాధించాలనుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని అర్జున్ కపూర్ ఈ మార్పు తో నిరూపించాడు అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపుగా 15 నెలల పాటు అర్జున్ కపూర్ కఠోర వర్కౌట్స్ చేయడంతో పాటు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఫ్యామిలీ ప్యాక్ బాడీ నుండి ఏకంగా సిక్స్ ప్యాక్ బాడీని సాధించగలిగాడు అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాను పట్టుదలతో చేసిన విషయాలను బరువు తగ్గడం కోసం పడ్డ కష్టాలను సోషల్ మీడియా ద్వారా అర్జున్ కపూర్ వెళ్లడించాడు.
ప్రస్తుతం అర్జున్ కపూర్ ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలో నటిస్తున్నాడు. ఇదే ఏడాది ఆ సినిమా రాబోతున్నట్లుగా మేకర్స్ బలంగా చెబుతున్నారు. ఏక్ విలన్ రిటర్న్ సినిమాలో అర్జున్ కపూర్ లుక్ చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఆ సినిమా కాకుండా మరో రెండు సినిమాలు కూడా అర్జున్ కపూర్ లైన్ లో పెట్టాడు. ఆ సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.