కరీనా లడకా సిగరెట్లు మానేశాడంట

Update: 2016-05-01 04:17 GMT
ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవారిలో ఏదో ఒక వ్యసనానికి అలవాటు పడ్డవాళ్లు చాలామందే ఉంటారు. ముఖ్యంగా సిగరెట్స్ హ్యాబిట్ చాలామందికే ఉంటుంది. అయితే, ఈ విషయాన్ని పైకి ఒప్పుకునే వారే అరుదుగా కనిపిస్తూ ఉంటారు. కాలుస్తామని గొప్పగా చెప్పుకునే బదులుగా.. ఆ అలవాటు మానేసి తాము కొంతమందికైనా ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశ్యంతో అసలు వాస్తవం చెబుతూ ఉంటారు.

గతంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెగ సిగరెట్లు కాల్చేవాడు. కానీ మెల్లగా ఆ అలవాటుకు దూరమయ్యాడు మహేష్. ఇక రామ్ చరణ్ కూడా ఇంతకుముందు స్మోకరే. కానీ.. సిగరెట్లు కాల్చీ కాల్చీ విసుగొచ్చేసిందన్న చెర్రీ.. ఫేస్ పై ఉన్న స్కిన్ కూడా తేడా వస్తుండడంతో మానేశానని ఒప్పుకున్నాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో స్టార్ ఫ్యామిలీ హీరో వచ్చి చేరాడు. అతనే బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. ఈ యంగ్ హీరో రీసెంట్ గానే సిగరెట్ అలవాటును వదిలించుకున్నాడు.

నిజానికి అర్జున్ ఈ ఏడాది జనవరి 1నుంచే సిగరెట్లు మానేయాలనే నిర్ణయం తీసుకుని, దాన్ని అమల్లో పెట్టాడు. ఆ విషయాన్ని ఇప్పుడే బయటపెట్టి, ఈ సమయంలో ఒక్క సిగరెట్ కూడా ముట్టుకోలేదని చెప్పుకొచ్చాడు. రోజుకు 20 సిగరెట్లు కాల్చేస్తూ చైన్ స్మోకర్ అనిపించుకున్న అర్జున్ కపూర్.. ఇప్పుడ ఒక్క సిగరెట్ కూడా ముట్టుకోని రేంజ్ కి రావడమంటే నిజంగా గ్రేట్ కదా.
Tags:    

Similar News