అర్జున్ పై పోలీసు కేసు నమోదు

Update: 2017-04-09 10:23 GMT
మోడల్ గా వెలిగిపోయి.. బాలీవుడ్ లో వెలుగులు విరజిమ్మిన నటుడు అర్జున్ రాంపాల్. ప్రస్తుతం సినిమాల కౌంట్ తగ్గినా.. టెలివిజన్ సిరీస్ లను బాగానే నిర్వహిస్తూ సొమ్ములు చేసుకుంటున్నాడు. ఇప్పుడీయన ఓ వివాదంలో చిక్కుకోవడంతో పాటు.. వ్యవహారం పోలీసు కేసు నమోదు చేసే వరకు వచ్చింది.

ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ జరిగిన ప్రైవేటు కార్యక్రమానికి డీజేగా వ్యవహరించాడు అర్జున్ రాంపాల్. ఈ సమయంలో ఓ ఫోటోగ్రాఫర్.. ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు. ప్రైవేట్ పార్టీ కావడంతో.. ఫోటోలు తీయద్దంటూ అర్జున్ రాంపాల్ ఎంత వారించినా ఫోటోగ్రాఫర్ వినలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఈ నటుడు.. ఫోటోగ్రాఫర్ చేతిలోంచి కెమేరా తీసుకుని విసిరేశాడు. ఇంతవరకూ బాగానే ఉంది.. అంతో ఇంతో సమర్ధించుకోవడానికి వీలుగానే ఉంది. కానీ అసలు సమస్యంతా విసిరేసిన కెమేరా దగ్గరే వచ్చింది. అర్జున్ విసిరేసిన కెమెరా ఓ కుర్రాడికి తగిలి.. తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో శోభిత్ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మీడియాపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు.. తనను గాయపరిచాడంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందడంతో.. వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News