వామ్మో.. వాయ్యో అని గుండెలు బాదేసుకునే వ్యవహారమిది. సినిమా అన్నది తెలుగువారికి ఎంతటి ఇష్టమైన వ్యాపకమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండి రిలాక్స్ కావాలంటే వచ్చే ఛాయిస్ లో మొదటిది సినిమానే. ఇంట్లో ఫంక్షన్ కానీ.. బర్త్ డే పార్టీ అంటే.. ఆ లిస్టులో సినిమా తప్పనిసరిగా ఉంటుంది. తెలుగోడి జీవితంలో సినిమాకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అలాంటి సినిమాను.. సినీ ప్రేమికులకు దూరం చేయాలన్న కుట్ర నిర్మాతలు చేస్తున్నారా? అంటే అవునన్నట్లుగా తాజా పరిస్థితి ఉంది.
ఈ రోజు విడుదలైన సినిమాల్లో శ్రీవిష్ణు నటించిన ‘అర్జున ఫల్గుణ’ మూవీ టికెట్ ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరోలా ఉండటం గమనార్హం. ఏపీలో టికెట్ ధరలపై నియంత్రణ.. కొత్త విధానంపై పలువురు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తెలంగాణలో నిర్మాతలు అనుసరిస్తున్న తీరు చూస్తే.. ఏపీ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుందన్నట్లుగా ఉందని చెప్పాలి. తాజాగా ఏపీ.. తెలంగాణలోని సినిమా టికెట్ల ధరల్ని చూస్తుంటే.. ఏపీలో పోయింది తెలంగాణలో రాబట్టుకోవాలన్నట్లుగా వారి తీరు ఉందని చెప్పాలి.
తాజాగా విడుదలైన అర్జున ఫల్గుణ సినిమా టికెట్ కు సంబంధించి ఆన్ లైన్ లో బుక్ చేసే ప్రయత్నం చేసినప్పుడు.. రెండు టికెట్ల మధ్య ధర వ్యత్యాసం గుండె పగిలిపోయేలా ఉంది. విజయవాడలో పీవీఆర్ మల్టీప్లెక్సులో రూ.150.. హ్యాండ్లింగ్ ఛార్జీలు రూ.2 కలిపితే.. టికెట్ ధర రూ.152కు వచ్చేసింది. అదే సినిమా టికెట్ హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న పీవీఆర్ మల్టీఫ్లెక్సులో బుక్ చేస్తే.. టికెట్ ధర రూ.250.. దాని మీద హ్యాండ్లింగ్ ఛార్జీలు రూ.39.76 చొప్పున వసూలు చేస్తున్నట్లు కనిపిస్తుంది.
అంటే.. ఏపీలో టికెట్ ధరకు తెలంగాణలో డబుల్ ధరకు అమ్మటం ఏం న్యాయం? ఇంత తేడా అయితే.. తెలంగాణలోని వారు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం మానేస్తారేమో? అయినా.. ఎక్కడ పోయింది అక్కడే రాబట్టుకోవాలి కానీ.. ఒకచోట పోయిందని చెప్పి.. మరోచోట వారిని వాయించేసి రాబట్టుకోవాలనుకోవటం ఏ మాత్రం మంచి ప్లాన్ కాదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి ప్రయత్నంతో మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని తెలుగు సినీ నిర్మాతలు ఎప్పుడు గుర్తిస్తారో?