తన విగ్రహం ముందే పడుకున్న హీరో

Update: 2017-08-22 06:51 GMT
ప్రపంచం లో ఎంత గొప్ప హోదా కలిగినా.. ఎన్ని వేల కోట్ల ఆస్థులున్నా మనిషి మాత్రం కాలాన్ని జయించలేడు అనేది జీవిత సత్యం. అంతే కాకుండా కాలం మనిషిని ఎప్పుడు ఒకేలా ఉండనివ్వదు. ఎంత త్వరగా అత్యున్నత హోదాను కల్పిస్తుందో అంతే త్వరగా కిందకు పడేయగలదు. ఇది అందరికి తెలిసిన విషయమే అయితే ఓ సెలబ్రెటీ తనకు జరిగిన ఓ ఘటనను ఉదాహరణగా చూపించి.. అందరిని ఆశ్చర్యపరిచాడు.

 ప్రపంచ బాడీ బిల్డర్స్ లో తనకంటూ ఓస్థానాన్ని సంపాదించుకొని టెర్మినేటర్ వంటి హాలీవుడ్ సినిమాలతో సూపర్ హీరోగా ఎదిగిన స్టార్ "ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్". అయితే ఈ హీరో కొన్నేళ్ల క్రితం క్యాలిఫోర్నియా 38వ గవర్నర్ గా పదవిని పొంది 2011 వరకు పదవిలో ఉన్నాడు. అయితే రీసెంట్ గా మాజీ గవర్నర్ ఏం చేశాడంటే.. కొలంబస్ - ఒహాయో దగ్గర తన గుర్తుగా నిర్మించిన శిల్పం ముందు పడుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతే కాకుండా ఆర్నాల్డ్ సోషల్ మీడియాలో తన స్టాట్యూ దగ్గర నిద్దురపోయిన ఫొటోను పోస్ట్ చేసి.. 'కాలం ఎలా మారిపోయింది' అంటూ హార్ట్ టచ్ అయ్యేలా శాడ్ కామెంట్ పెట్టాడు.

అయితే ఆర్నాల్డ్ కి అలాంటి పరిస్థితి రావడానికి కారణం లేకపోలేదు. అసలు విషయంలోకి వెళితే.. ఆర్నాల్డ్ గవర్నర్ గా ఉన్నపుడు తన విగ్రహం ముందు ఓ స్టార్ హోటల్ ప్రారంభోత్సవం కోసం గెస్ట్ గా వెళ్లగా అక్కడ నిర్వాహకులు ఆయన చేతుల మీదుగా హోటల్ ని ప్రారంభించారు. అయితే అప్పుడు హోటల్ యజమానులు జీవితాంతం ఆర్నాల్డ్ ఎప్పుడు వచ్చినా ఆయనకు ఈ హోటల్ లో ఓ గది ఉచితంగా ఉంటుందని చెప్పారు. అయితే కొన్నేళ్ల తర్వాత ఆర్నాల్డ్ పదవి కాలం పూర్తయ్యింది. రీసెంట్ గా ఓ పని మీద ఆ ప్రాంతానికి వెళ్లిన ఆర్నాల్డ్ ఆ హోటల్ లో బస చేయడానికి వెళదాం అనుకున్నాడు. కానీ హోటల్స్ యాజమాన్యం రూమ్స్ లేవని అన్ని ఫుల్ అయిపోయాయని చెప్పడంతో ఆర్నాల్డ్ మనసు కలత చెందింది. వెంటనే హోటల్ ముందు ఉన్న తన స్టాట్యూ దగ్గర నిద్రించి ప్రపంచానికి ఓ మెసేజ్  ఇచ్చాడు. ఇది ఆర్నాల్డ్ ఫొటో అసలు స్టోరీ.
Tags:    

Similar News