`అర్థం` టీజ‌ర్‌ టాక్ : ముసుగు తొడిగిన వినాశ‌నం!

Update: 2022-08-19 13:17 GMT
కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కు ప్రేక్ష‌కులు ప‌ట్టం క‌డుతుండ‌టంతో చాలా మంది ద‌ర్శ‌కుడు విభిన్న‌మైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు. అలాంటి స‌రికొత్త థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌రే `అర్థం`. శ్ర‌ద్ధా దాస్‌, మాస్ట‌ర్ మ‌హేంద్ర‌న్‌, సాహితి అవంచ‌, నందా దురైరాజ్‌, అజ‌య్ ఆమ‌ని, సాహితి అవంచ సాయి ధీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

రిత్విక్ వెట్షా స‌మ‌ర్ప‌ణ‌లో మిన‌ర్వ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై రాధికా శ్రీ‌నివాస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీ ద్వారా మ‌ణికాంత్ త‌ల్లాంగుటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ మూవీ టీజ‌ర్‌ ని శుక్ర‌వారం విడుద‌ల చేశారు. `అంద‌రూ క‌ల‌ల్ని నిం చేసుకోవాల‌నుకుంటారు. కానీ నా నిజం క‌లైతే బాగుండూ అనుకుంటాను. బ‌ట్ `వైత‌ర‌ణీ నిల‌యం..` అంటూ శ్ర‌ద్దా దాస్ వాయిస్ తో ఆస‌క్తిక‌ర‌మైన విజువ‌ల్స్ తో టీజ‌ర్ మొద‌లైంది. చుట్టూ చెట్ల మ‌ధ్య ఒంట‌రిగా వున్న వైత‌ర‌ణీ నిల‌యం చుట్టూ సాగే థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. విజువ‌ల్స్, మేకింగ్ క్వాలిటీగా వుండి సినిమా పై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

అంథ‌కారంలో అణుచుకున్న కోరిక‌ల‌న.. ఆవిరైన ఆశ‌ల‌ను..త‌న‌లో నిత్యం మోస్తూ..త‌ల్ల‌డిల్లే ఓ అగ్న‌క‌ణం.. నా అని న‌మ్ముకున్న వాళ్లే..న‌ట్టేట ముంచితే..దాన‌వ‌మే త‌న మార్గం.. న‌ర‌మేధ‌మే త‌న ధ‌ర్మం.. ముసుగు తొడిగిన వినాశ‌నం.. ఆర‌డుగుల య‌మ‌పాశం..మాన‌వత్వం మ‌స‌క‌బారి.. మ‌నిషిత‌నం మ‌రిచిపోయి అక్క‌సు క‌క్కిన ఈ స‌మాజం..ర‌క్క‌సుడై మారిన వైనం.. రావ‌ణుడై ఎదిగిన రూపం..ఎదురు నిల‌బ‌డితే త‌ట్టుకోగ‌ల‌దా? . అంటూ సాగే వాయిస్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

`అర్జున్ రెడ్డి` చిత్రానికి నేప‌థ్య సంగీతం అందించిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ ఈ మూవీకి సంగీతం అందించారు. టీజ‌ర్ త‌న నేప‌థ్య సంగీతం వ‌ల్ల మ‌రింత‌గా ఎఫెక్టీవ్ గా వుంది. ప‌వ‌న్ చెన్న సినిమాటోగ్ర‌ఫీ కూడా ఈ మూవీకి ప్ర‌ధాన బ‌లంగా నిలుస్తుంద‌ని తెలుస్తోంది.

డార్క్ నెస్ థీమ్ తో తెర‌కెక్కించిన స‌న్ని వేశాల్లో కెమెరా మెన్ వ‌ర్క్ ప్ర‌ధానంగా క‌నిపిస్తోంది. `వైత‌ర‌ణీ నిల‌యం`లో ఏం జ‌రిగిందో తెలియాలంటే ఈ మూవీ  చూడాల్సిందే అనే ఆస‌క్తిని టీజ‌ర్ తోనే క‌లిగించి స‌క్సెస్ అయ్యారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Full View
Tags:    

Similar News