తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవుతుండడం ప్రస్తుతం ఓ ట్రెండ్. అప్పడప్పుడు హిందీ సినిమాల్ని సౌత్ లోనూ రీమేక్ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ కోవలోనే ఆయుష్మాన్ ఖురానా నటించిన `ఆర్టికల్ 15` చిత్రాన్ని తెలుగు- తమిళ్ లో తెరకెక్కించేందుకు హీరో కం నిర్మాత ధనుష్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
ఆ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకుని సౌత్ కి తగ్గట్టు స్క్రిప్టును తీర్చిదిద్దుతున్నారట. ఆర్టికల్ 15 హార్డ్ హిట్టింగ్ హిందీ మూవీ. అనుభవ్ సిన్హా లాంటి ప్రతిభావంతుడు తెరకెక్కించాడు. అక్కడ క్రిటిక్స్ నుంచి ప్రశంసల తో పాటు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో ఎమోషన్ అందరికీ నచ్చింది.
కథా వైవిధ్యం ఉన్న సినిమాల వెల్లువ మొదలైన ఈ సీజన్ లో ఇలాంటివి సౌత్ లో వర్కవుట్ అవుతాయని ధనుష్ బావిస్తున్నారట. అందుకే రెండు భాషల్లోకి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ధనుష్ ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే కాన్సెప్టు బావున్న వాటిని నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. నవతరం ట్యాలెంటుకు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరైనా తెలుగు నిర్మాత టై-అప్ తో ఈ సినిమాని ధనుష్ నిర్మించే వీలుందని తెలుస్తోంది. సౌత్ రీమేక్ కి కాస్టింగ్.. దర్శకుడిని ఎంపిక చేయాల్సి ఉందింకా.