తమిళ్ యాక్టర్ కి సింగపూర్ రైట్స్

Update: 2016-07-13 05:17 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి మూవీకి సెన్సార్ కూడా పూర్తయిపోవడంతో.. ఇప్పటికే రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జూలై 22న అంటే మరో 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ మూవీ విడుదల కావడం ఖాయమైంది. దీంతో ఈ సినిమాకి సంబంధించిన రైట్స్ కోసం విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటికే చాలా ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ అయిపోగా.. మిగిలిన వాటి కోసం ఇప్పుడు క్రేజ్ తారాస్థాయికి చేరింది.

కబాలికి సంబంధించిన సింగపూర్ హక్కులను తమిళ్ యాక్టర్ కం ప్రొడ్యూసర్ అయిన అరుణ్ పాండ్యన్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సింగపూర్ లో రజినీకాంత్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన సినిమాలకు ఎనలేని క్రేజ్ ఉంటుంది అందుకే కబాలి సింగపూర్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం చాలా డిమాండ్ ఏర్పడింది. ఈ పోటీలో భారీ మొత్తాన్నే చెల్లించి అరుణ్ పాండ్యన్ ఈ రైట్స్ ను కొనుగోలు చేశారని తెలుస్తోంది. తమిళ్ తో పాటు తెలుగు కన్నడల్లో కూడా అనేక సినిమాల్లో నటించిన అరుణ్ పాండ్యన్.. పలు తమిళ చిత్రాలను నిర్మించారు కూడా.

మరోవైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నకొద్దీ కబాలికి డిమాండ్ పెరిగిపోతోంది. 2016 సెకండాఫ్ కు కబాలి గ్రాండ్ వెల్ కమ్ చెబుతుందని.. సౌత్ సినిమా మొత్తం ఎదురుచూస్తోంది.
Tags:    

Similar News