రోజూ 40 గుడ్లు.. 2కేజీల చికెన్ లాగిస్తున్న హీరో

Update: 2016-05-01 04:52 GMT
చిత్రపరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నా.. కొందరు హీరోలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది. కోలీవుడ్ యూత్ హీరో ఆర్య సంగతే తీసుకుంటే.. అతగాడంటే.. హీరోయిన్స్ అమితంగా ఇష్టపడుతుంటారు. మిగిలిన హీరోలతో పోలిస్తే ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శిస్తారు. అతడితో కలిసి నటిస్తే.. చాలా కంఫర్ట్ అని చెబుతుంటారు. తమిళ డబ్బింగ్ ల పుణ్యమా అని తెలుగువారికి సుపరిచితమైన ఆర్యకు ఈ మధ్య కాలంలో సరైన హిట్టు పడింది లేదు.

మాంచి హిట్ కోసం తపిస్తున్న ఇతగాడు తాజాగా రాఘవ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో ఆర్య.. అడవి మనిషిగా నటిస్తున్నాడట. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి.. అచ్చు అడవి మనిషిలా కనిపించేందుకు వీలుగా అతగాడు విపరీతమైన కసరత్తు చేస్తున్నాడట. ఇందుకోసం స్పెషల్ డైట్ తీసుకుంటున్నట్లు చెబుతున్నాడు. అడవి మనిషిలా కనిపించటం కోసం.. భారీగా ఎక్స్ ర్ సైజులు చేయటమేకాదు.. తినే ఫుడ్ లోనూ చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

ఈ పాత్రను తెర మీద అద్భుతంగా పండించటం కోసం రియల్ లైఫ్ లో రోజూ 40 గుడ్లు.. రెండు కేజీల చికెన్ లాగిస్తున్నాడట. అంతేకాదు.. బాడీ మాంచి షేప్ లో వచ్చేందుకు వీలుగా ఉదయం రెండు గంటలు.. సాయంత్రం గంట పాటు జిమ్ లో చెమటలు కక్కుతూ కష్టపడుతున్నట్లు చెబుతున్నారు. షూటింగ్ జరుగుతున్న అడవిలో కాళ్లకు చెప్పుల్లేకుండా తిరుగుతున్నానని.. తనకేం కావటం లేదని ఈ యూత్ హీరో చెప్పుకుంటున్నాడు. మరి ఇంతగా కష్టపడుతున్న ఆర్య.. స్ర్కీన్ మీద అతగాడి కష్టం ఎంతలా కనిపిస్తుందో చూడాలి.
Tags:    

Similar News