సినిమా అంటేనే కల్పితం.. కానీ, అదంతా నిజమే అనిపించేలా చిత్రీకరిస్తుంటారు దర్శకులు. అయితే.. సినిమాలో భాగంగా కొన్ని ప్రమాదకరమైన సీన్స్ షూట్ చేయాల్సి వచ్చినప్పుడు ‘డూప్’ను ఉపయోగిస్తుంటారు. అంటే.. నటుడు చేయాల్సిన సన్నివేశాన్ని మరో.. అజ్ఞాత వ్యక్తితో షూట్ చేస్తారు. కానీ.. మారుతున్న కాలంలో డూబ్ లేకుండా తామే సాహసం చేస్తున్నారు నేటితరం నటీనటులు.
ఈ విధంగానే ఓ సాహసం చేసి గాయాలపాలయ్యాడు తమిళ్ నటుడు ఆర్య. తమిళ స్టార్ విశాల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘విలన్’. ఈ మూవీలో ఆర్య ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీఫిలిం సిటీలో కొనసాగుతోంది. అయితే.. ఈ మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చెన్నైలో షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగిందట. ఓ యాక్షన్ సీన్ కోసం జంపింగ్ చేస్తుండగా ఆర్య గాయపడ్డాడట. దీంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు.
అయితే.. చికిత్స పూర్తవగానే ఆర్య మళ్లీ సెట్స్ లో జాయిన్ అయ్యాడని, మిగిలిన సీన్లను పూర్తిచేశాడని కోలీవుడ్ వర్గాల టాక్. ఈ చిత్రంలో విశాల్ హీరోగా, ఆర్య విలన్‌గా కనిపించబోతున్నారు. ‘నోటా’ చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ విశాల్‌కు 30వ చిత్రం కాగా ఆర్యకు 32వ చిత్రం.
కాగా.. తనదైన యాక్టింగ్ స్టైల్‌తో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తుంటాడు ఆర్య. ఇప్పటికే.. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘వరుడు’ సినిమాలో ఆర్య విలన్ గా నటించాడు. కాగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ లోనూ విలన్ రోల్ కోసం ఆర్య పేరును పరిశీలిస్తున్నాడట డైరెక్టర్ సుకుమార్. ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.