నయనతారతో ఎఫైర్ సాగిస్తున్నాడంటూ లవర్ బాయ్ ఆర్య పేరు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. బాస్ ఎంగిర భాస్కరన్ షూటింగ్ టైమ్ లో ఈ ఇద్దరి మధ్యా కెమిస్ర్టీ అదిరిపోయిందన్న ప్రచారం సాగింది. ఆర్య అంటే నయన్ కి ప్రాణం. ఇక అతడిని ప్రేమించింది కాబట్టి పెళ్లి చేసుకుంటుందనే అనుకున్నారు. ఈ విషయంపై కో్లీవుడ్, టాలీవుడ్ లో చాలా రూమర్లున్నాయ్‌లే.
ఇంతలోనే అతడు-ఆమె మధ్యలో ఆయన అన్నట్టు శింబు స్నేహితుడు విఘ్నేష్ శివన్ పేరు వినిపించింది. విఘ్నేష్ దర్శకత్వంలో ఓ హారర్ సినిమాలో నటిస్తున్న నయన్ త్వరలోనే ఈ యువ దర్శకుడిని పెళ్లి చేసుకోబోతోందంటూ కోలీవుడ్ లో టాక్. అయితే ఇటు నయన్ నుంచి కానీ, అటు విఘ్నేష్ నుంచి కానీ అధికారికంగా దీని గురించిన ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. సరిగ్గా ఇలాంటి టైమ్ లో ఆర్యని ఓ చిక్కు ప్రశ్న తీవ్రంగా వేధించింది. నయన్ ని స్నేహితురాలు అంటూ ప్రమోట్ చేస్తారు? తనతో మీకు ఏ రిలేషన్ లేదా? అన్న ప్రశ్నకు.. తను మంచి స్నేహితురాలు మాత్రమే అని సమాధానం దాటవేశాడు.. మన హీరో ఆర్య.
అయినా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా అది పెద్దల అంగీకారంతోనే అంటూ మెలిక వేశాడు. నయన్ ఎక్కడ ఉన్నా బావుండాలి.. అంటూ ఓ ప్రేమికుడి మనసును ఆవిష్కరించాడు తప్ప ఎక్కడా ఆర్య ఒక ఫ్రెండ్ గా అనిపించలేదు మరి. జీవితం ఓ డెస్టినీ. అది ఎవరితో రాసి పెట్టి ఉంటే అక్కడ జరగాల్సిందే. పెళ్లి విషయంలో పైవాడు శాసిస్తాడు. మనం ఆచరిస్తాం అంతే.. అంటూ వేదాంత కూడా చెబుతున్నాడు. ఏంటో మరి!!