స్టార్ హీరోల సినిమాల్లో వారి చిన్నప్పటి పాత్రలు చేసే పిల్లలు భలే క్యూట్ గా ఉంటారు. వాళ్లను చూస్తుంటే పిల్లలు భలే ఉన్నారే అనిపిస్తూ ఉంటుంది. ఆ పిల్లల్లో ఎక్కువ శాతం సెలబ్రెటీ పిల్లలే ఉంటారు. స్టార్స్ సినిమాలో చిన్నప్పటి పాత్రల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు. ఆ అవకాశం వచ్చి క్లిక్ అయితే మామూలుగా ఉండదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో బుడ్డ ఇంద్ర సేనారెడ్డిగా నటించిన తేజ సజ్జ ఎంతటి గుర్తింపు దక్కించుకున్నాడో తెల్సిందే.
ఇప్పటికి కూడా తేజ కు ఆ ఇమేజ్ కెరీర్ లో హెల్ప్ అవుతూనే ఉంది. అందుకే స్టార్ హీరోల సినిమాల్లో హీరో చిన్నప్పటి పాత్రలు చేసే అవకాశం ఎక్కువగా స్టార్ కిడ్స్ కు దక్కుతూ ఉంటాయి. మహేష్ బాబు నటించిన 'నేనొక్కడినే' సినిమా లో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో ఆయన తనయుడు గౌతమ్ కృష్ణ నటించిన విషయం తెల్సిందే.
ఆ సినిమాతో గౌతమ్ కృష్ణ కు మంచి గుర్తింపు వచ్చింది. నేనొక్కడినే సినిమాలో గౌతమ్ పాత్ర నిడివి కాస్త ఎక్కువగానే ఉంటుంది. కనుక ప్రేక్షకుల్లో రిజిస్ట్రర్ అయ్యాడు. ఇప్పటికి కూడా గౌతమ్ మళ్లీ ఎప్పుడు నటిస్తాడా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ సినిమాలో తన చిన్నప్పటి పాత్రలో గౌతమ్ ను నటింపజేసిన మహేష్ బాబు ఈసారి తన మేనల్లుడు చరిత్ ను బుల్లి మహేష్ బాబు గా చూపించబోతున్నాడట.
సర్కారు వారి పాట సినిమా లో హీరో పాత్ర చిన్నప్పటి సన్నివేశాలు కీలకంగా ఉంటాయట. ఆ సన్నివేశాలే సినిమా కథ ఆరంభంకు నాందిలా ఉంటాయట. అందుకే ఆ సన్నివేశాల్లో నటించేందుకు గాను సుధీర్ బాబు తనయుడు అయిన చరిత్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై అనధికారికంగా వార్తలు వచ్చాయి. తాజాగా సుధీర్ బాబు ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు.
సుధీర్ బాబు సినీ రంగ ప్రవేశం జరిగి 10 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా మీడియాతో ముచ్చటించాడు. ఆ సమయంలో తన ఇద్దరు కొడుకులు కూడా సినిమాల్లో నటించడం ఆనందంగా ఉందన్నాడు. పెద్దబ్బాయి తన సినిమాలో నటించగా చిన్నబ్బాయి చరిత్ ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాలో కనిపించబోతున్నాడని సుధీర్ బాబు చెప్పుకొచ్చాడు. వారు ఇద్దరు కూడా సినిమా లపై ఆసక్తి చూపిస్తూ ఉన్న కారణంగానే వారిని నటింపజేస్తున్నట్లుగా కూడా సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.
మహేష్ బాబు సినిమాతో చరిత్ తెరంగేట్రం చేయబోతున్నాడు కనుక భవిష్యత్తులో మంచి స్టార్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు వారి పాట సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. త్వరలోనే తుది షెడ్యూల్ ను ముగించి మహేష్ బాబు తన తదుపరి సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. సర్కారు వారి పాట సినిమా సమ్మర్ లో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.