ఒకప్పుడు హీరోలు బరువు పెరగడం.. తగ్గడం అనేవి చాలా రేర్ గా చూస్తూ ఉండేవాళ్లం. లావు ఎక్కువగా కనిపించాలంటే ఏదైనా ప్రత్యేక మేకప్ లేదా స్పెషల్ కెమెరా ను ఉపయోగించేవారు. కాని ఇప్పుడు నటీ నటులు ఏమాత్ంర రాజీ పడటం లేదు. బరువుగా కనిపించాలంటే ఆ పాత్ర కోసం బరువు పెరుగుతున్నారు.. సన్నబడాలంటే సన్నగా అయ్యేందుకు సిద్దం అవుతున్నారు. ఇలా ఎంతో మంది స్టార్స్ సినిమాల కోసం తమ ఫిజిక్ ను ఎన్నో విధాలుగా మార్చుకుంటూ ఉన్నారు. అయితే ఒక ప్రాజెక్ట్ కోసం బరువు పెరిగి.. ఆ ప్రాజెక్ట్ మద్యలో ఆగిపోవడంతో ఆ బరువును అలాగే కంటిన్యూ చేయడం అంటే ఎంతటి కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ నటించిన బాబ్ బిస్వాస్ మూవీ జీ5 లో డిసెంబర్ 3న స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. ఆ ప్రాజెక్ట్ ప్రమోషన్ సందర్బంగా అభిషేక్ పడ్డ కష్టం గురించి యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కరోనా లాక్ డౌన్ కు ముందు ఈ సినిమాను ప్రారంభించారు. సినిమాలో అభిషేక్ 100 నుండి 105 కిలోల బరువుతో కనిపించాల్సి ఉంటుంది. అందుకే కొన్ని నెలల ముందు బాగా వెయిట్ పెరిగాడు. వెయిట్ పెరిగిన అభిషేక్ బచ్చన్ షూటింగ్ లో జాయిన్ అవ్వడం.. మరో రెండు వారాల్లో షూటింగ్ ముగుస్తుందని అనుకుంటూ ఉండగా అనూహ్యంగా లాక్ డౌన్ రావడంతో చాలా రోజుల పాటు అభిషేక్ బచ్చన్ ఆ వెయిట్ ను మెయింటెన్ చేయాల్సి వచ్చింది.
అభిషేక్ బచ్చన్ మళ్లీ షూటింగ్ పునః ప్రారంభం అయ్యి ఆ సినిమా పూర్తి చేసిన తర్వాతే బరువు తగ్గడం ప్రారంభించాడు. ఒక సినిమా కోసం ఇంతగా కష్టపడటం నిజంగా గొప్ప విషయం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాబ్ బిస్వాస్ లో ఒక క్రిమినల్ పాత్రలో జూనియర్ బిగ్ బి కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. కోల్ కత్తాకు చెందిన ఒక వ్యక్తి పాత్రనే ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఆ వ్యక్తి పోలికలకు దగ్గరగా ఉండటం కోసం ఈ ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. జూనియర్ బచ్చన్ కష్టం ఈ సినిమాలో ఖచ్చితంగా కనిపిస్తుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అదృష్టం కలిసి రాక అభిషేక్ బచ్చన్ కు అవకాశాలు రావడం లేదు కాని ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలు చాలానే ఆయన చేశాడు.