ఆషూ ప్రెగ్నెంట్.. తల్లి చేతిలో చావు దెబ్బలు.. ఇదేం ముష్టి ఐడియా?

Update: 2021-12-08 04:30 GMT
అందరిని ఆకట్టుకోవటానికి ఏమైనా చేసేయటమేనా? మనకు వినోదంగా అనిపించేవి.. మిగిలిన వారికి వేదనకు కలిగిస్తాయన్న చిన్న విషయాన్నిమర్చిపోయేలా చేసిన ఆషూ రెడ్డి ముష్టి ఐడియాకు కోపం కట్టలు తెంచుకోవటం ఖాయం. తన యూట్యూబ్ చానల్ ఇమేజ్ ను పెంచుకోవటానికి భారీ చెత్త ఐడియా వేసి.. అందులో తన తల్లి ఎమోషన్ ను వీడియోగా మార్చేసి జనాల మీదకు వదిలిన తాజా వీడియో ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. షాకింగ్ తిట్టు తినేలా చేస్తోంది.

తరచూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లోకి రావాలన్న కక్కుర్తిని ప్రదర్శించే ఆషూరెడ్డి..తాజాగా ఒక ప్రాంక్ వీడియోను చేసింది. తన స్నేహితుల సాయంతో ఇంట్లో దుకాణం పెట్టేసింది. ఇందులో.. తాను ప్రెగ్నెంట్ అయ్యానని ఏడుస్తూ కూర్చోవటం.. నిద్ర పోతున్న తల్లిని లేపి షాకింగ్ న్యూస్ చెప్పటంతో.. ఆమె చేష్టలుడిగిపోవటం కనిపిస్తుంది కాసేపు ఈ డ్రామాను కంటిన్యూ చేసి.. ఆ క్రమంలో కోపంతో తన తల్లి చేతలతో.. కాళ్లతో దెబ్బలు తిన్న ఆషూరెడ్డి.. అందరిని నవ్వించేందుకు చేసిన ప్రయత్నంగా చెప్పుకోవటం చూసినప్పుడు ఒళ్లు మండిపోవటం ఖాయం.

తాను ప్రెగ్నెంట్ అని.. దానికి కారణాన్నిచెప్పకుండా.. బేబీని పెంచుకుంటానని చెప్పటంతో.. కోపం నశాళానికి అంటిన ఆమె తల్లి.. పెంచుకునేదేంది? ఏమైనా కుక్క పిల్లా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. తండ్రికి చెబుతానని ఆవేశంగా లోపలకు వెళ్లి.. ఫోన్ తీసి.. కాల్ చేసే వేళలో.. తాను చేసిందంతా ప్రాంక్ వీడియో అంటూ అసలు రహస్యాన్ని రివీల్ చేసింది. నీకు ప్రాంక్ వీడియో ఏమో కానీ.. నాకు మాత్రం హార్ట్ ఎటాక్ తెప్పించావ్.. అంటూ ఆమె కోపాన్ని ప్రదర్శిస్తూ.. రెండు దెబ్బలు తగిలించింది.

ఇదంతా చూసినప్పుడు.. ఫన్నీ పేరుతో ఇలాంటి ముష్ఠి వీడియోల్ని తీసే ఆషూ రెడ్డిపై కోపం రావటం ఖాయం. తల్లి ఎమోషన్ ను కామెడీ చేసుకోవటం ఏమిటి? అన్న మండిపాటు ఈ వీడియోను చూసినంతనే కలుగక మానదు. లైకులు.. సబ్ స్క్రైబ్ లు పెంచుకోవటం కోసం ఇలాంటి దరిద్రపు గొట్టు ఐడియాలు అవసరమా? అన్న క్వశ్చన్ రాక మానదు.

Full View
Tags:    

Similar News