బాలీవుడ్ టు హాలీవుడ్ మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా అసాధారణ జర్నీ గురించి తెలిసిందే. గ్లోబర్ స్టార్ గా నేడు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించుకున్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే పరిశ్రమకు వచ్చి అక్కడా గాడ్ ఫాదర్ లేకుండా ఎదిగిన తీరు అనన్య సామాన్యం.
అయితే తాను జీవితంలో బిగ్ బ్రేక్ రావడానికి సుదీర్ఘ కాలం వేచి చూడాల్సి వచ్చిందని అంత సమయం ఎదురుచూడకూడదని పీసీ వ్యాఖ్యానించారు. దాదాపు బాలీవుడ్ లో 50 పైగా చిత్రాల్లో నటించిన ప్రియాంక చోప్రా.. తాను కెరీర్ కోసం ఎన్నో యుద్ధాలు చేశానని ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నాక ఎలా ఎదగాలో అర్థమైందని కూడా పీసీ తన అనుభవాల్ని వివరించారు. వైఫల్యాల తర్వాత మీరు చేసేది మిమ్మల్ని నిర్వచిస్తుంది. నాకు జీవితం ఒక నిచ్చెన. ఇది ఎప్పుడూ గమ్యం కాదు అని వ్యాఖ్యానించారు.
మీరు ఎక్కడికి వెళుతున్నా అందరి కంటే వేగంగా పరిగెత్తాలని ఆసియన్లుగా మేము ఎల్లప్పుడూ బోధించాం. నన్ను నేను ఒక ప్రధాన స్రవంతి ప్రముఖ మహిళగా చూడాలనుకున్నాను. నేను ప్రత్యక్షంగా చూసిన స్టీరియోటైప్ లోకి వెళ్లకూడదనుకున్నా.. దీనికి 10 సంవత్సరాల పని అవసరం… చివరకు నేను అనుకున్నచోటికి చేరుకోగలిగానని భావిస్తున్నాను. కాబట్టి మీ కోసం మాత్రమే కాకుండా.. మీ తర్వాత వచ్చే ప్రతిఒక్కరికీ గోల్ ని నిర్ధేశించడం మీ బాధ్యత అని నేను భావిస్తున్నాను. తరువాతి తరం దక్షిణాసియా ప్రతిభావంతుల కోసం.. వారు కోరుకున్న పాత్రలు పొందడానికి 10 సంవత్సరాలు పట్టకూడదని నేను కోరుకుంటున్నాను అని ఆమె అన్నారు.
మహమ్మారి క్రైసిస్ ని ఎదుర్కొంటున్న పేద ప్రజలకు సహాయం చేయడానికి తన వంతుగా పీసీ ప్రయత్నం చేస్తోంది. కోవిడ్ -19 ఉపశమనం కోసం ఇటీవల రూ .22 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. మ్యాట్రిక్స్ 4- టెక్స్ట్ ఫర్ యు- సిటాడెల్ సిరీస్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు పీసీ.