హ్యారీపోట‌ర్ రైట‌ర్ కి అవ‌మానం?

Update: 2021-11-19 07:40 GMT
వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ప్రాంచైజీ `హ్యారీపోట‌ర్` సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌పంచవ్యాప్తంగా `హ్యారీపోట‌ర్` కి ప్ర‌త్యేక‌మైన అభిమానులు ఉన్నారు. ఇప్ప‌టికీ రెగ్యుల‌ర్ బేసిస్ లో హెచ్ బీవో లో హ్యారీపోట‌ర్ లైవ్ అవుతుందంటే టీవీల‌కు అతుక్కుపోయే ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

అంత‌గా హ్యారీపోట‌ర్ ఫ్రాంచైజీ ప్రేక్ష‌కుల‌పై ప్ర‌భావం చూపిస్తుంది. తాజాగా హెచ్ బీవో హ్యారీ పోట‌ర్ టీమ్ 20వ ఏడాది వార్షికోత్స‌వాలు నిర్శ‌హించింది. ఈ సంద‌ర్భంగా హ్యారీ పోట‌ర్ ఫ్రాంఛైజీలో న‌టించిన వారంతా ఒకేచోట రీయూనియ‌న్ అయ్యారు. అలాగే ఆ ఫ్రాంఛైజీకి ప‌నిచేసిన టెక్నీషియ‌న్స్...మిగ‌తా టీమ్ అంతా కూడా వార్షికోత్స‌వాల్లో పాల్గొన్నారు.

డైరెక్ట‌ర్ క్రిస్టోఫ‌ర్ కొలంబస్..డేనియ‌ల్ రాడ్ క్లిప్..ఎమ్మా వాట్స‌న్.. రూప‌ర్ గ్రింట్ ఇంకా `హ్యారీ పోర్ట‌ర్` ఎనిమిది భాగాల న‌టీన‌టులు ప‌లువురు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హ్యారీపోర్ట‌ర్ మొద‌టి భాగ‌మైన `రిట‌ర్న్ టూ హాగ్వార్స్ట్`ని ప్ర‌దర్శించారు. అందులో న‌టించిన‌ వారంతా త‌మ పాత్ర‌ల్ని మ‌రోసారి వెండి తెర‌పై చూసుకుని మురిసిపోయారు.

20 ఏళ్ల క్రితం నాటి జ్ఞాప‌కాల్లోకి వెళ్లిపోయారు. అయితే ర‌చ‌యిత జె.కె రౌలింగ్ మాత్రం ఈవెంట్ కి హాజ‌రు కాలేదు. ఆమె ఆర్క్ వై చేసిన‌ ఫుటేజ్ మాత్రం ప్ర‌ద‌ర్శిత‌మైంది. మాయా ఫోర్ స్టేట‌ర్ ట్రాన్స్ ఫోబిక్ స్టేట్ మెంట్లకు.. రౌలింగ్ వ్యాఖ్య‌లకు పొంత‌న లేదు.

రౌలింగ్ వ్యాఖ‌ల్ని అప‌హ‌స్యం చేసే ప్ర‌య‌త్నం చేసి ట్రాన్స్ వ్య‌క్తుల‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఆ కార‌ణాన్ని ముందే ఊహించి రౌలింగ్ హాజ‌రు కాలేదా? అన్న సందేహం తెర‌పైకి వ‌స్తోంది. హ్యారీ పోట‌ర్ సిరీస్ చివ‌రి చిత్రం 2011 లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సిరీస్ సినిమాల‌న్నీ బుల్లితెర‌- ఓటీటీల్లో చ‌క్క‌ని ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటున్నాయి.




Tags:    

Similar News