మెగాస్టార్ తన 150వ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ చిత్రానికి 'ఆటోజానీ' అనే పేరు ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఆ టైటిల్ అభిమానుల్లోకి వెళ్లిపోయింది. అయితే అందరూ అనుకొంటున్నట్టుగా ఆ చిత్రం పేరు ఆటోజానీ కాదట. ఆ విషయాన్ని చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. అదంతా అభిమానులు సృష్టించిన పేరే అనీ, అయితే ఇంకా పేరు గురించి అధికారికంగా నిర్ణయం తీసుకోలేదని స్వామినాయుడు ప్రకటించాడు.
ఏడేళ్ల తర్వాత చిరు రీ ఎంట్రీ ఇస్తుండడం ఓ విశేషం కాగా, అది 150వ చిత్రం కావడం మరో విశేషం. అందుకే అటు చిత్ర పరిశ్రమ ఇటు ప్రేక్షకులు ఆ చిత్రం గురించి ఎదురు చూస్తోంది. పూరి జగన్నాథ్ ఇప్పటికే చిరుకి కథ చెప్పడంతో పాటు, ఆ సినిమా పేరు ఆటోజానీ అని కూడా ప్రకటించాడు. అయితే ఉన్నట్టుండి స్వామినాయుడు ఆ పేరు ఖరారు కాలేదని చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది. దీన్నిబట్టి చూస్తే పూరి దర్శకత్వంలో చిరు సినిమా చేయడం లేదని అర్థమవుతోంది. వేరొక దర్శకుడితో చిరంజీవి సినిమా చేయబోతున్నాడన్న ఊహాగానాలు బలం చేకూరుతోంది. ఇటీవల వినాయక్, చిరు కలిసి కథ గురించి చర్చలు కూడా జరిపారు. 151వ సినిమా గురించే వాళ్లిద్దరూ చర్చలు జరిపారని ప్రచారం సాగినా.. అన్నీ కుదిరితే ఇద్దరూ కలిసి 150వ సినిమానే చేయొచ్చని ఫిల్మ్‌నగర్ జనాలు మాట్లాడుకొంటున్నారు.