కొత్త పోస్టర్ తో గాట్టి షాకిచ్చారు

Update: 2016-08-31 05:30 GMT
ఊహలు గుసగుసలాడే అంటూ డైరెక్టర్ గా తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న శ్రీనివాస్ అవసరాల.. జ్యో అచ్యుతానంద అంటూ మరో చిత్రాన్ని తెరకెక్కించాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల నుంచీ.. అందరినీ ఆకట్టుకుంది. అసలు ట్రైలర్ చూశాకే ఇది ఓ అన్నాదమ్ముల ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనే విషయం జనాలకు అర్ధమైంది.

కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ పోస్టర్స్ చూస్తే మరిన్ని మెలికలతోపాటు క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రీసెంట్ గా సెన్సార్ పూర్తి కావడంతోపాటు.. క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చిందని చెప్పిన దర్శకుడు.. జ్యో అచ్యుతానందకు కొత్త పోస్టర్ వేశాడు. దీనిలో నారా రోహిత్.. నాగశౌర్యలకు వేరే వేరే అమ్మాయిలు జంటలుగా ఉన్నారు. అంటే వాళ్లిద్దరూ కలిసి రెజీనాకి లైన్ వేసినా.. ఇద్దరికి చెరో హీరోయిన్ సెపరేట్ గా ఉంటుందన్న మాట. ఇంకో సంగతి ఏంటంటే...ఈ కొత్త పోస్టర్ తో మరో షాకింగ్ నిజం తెలుస్తోంది.

డెంటిస్ట్ గా యాక్ట్ చేస్తున్న రెజీనా కోసం.. హీరో శశాంక్ స్పెషల్ కేరక్టర్ చేస్తున్నాడని అర్ధం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్.. ఇవన్నీ పోస్టర్లను చూస్తే అర్ధమవుతున్న విషయాలే తప్పితే.. అసలు నిజాలు తెలియాలంటే సెప్టెంబర్ 9వరకు ఆగాల్సిందే. మొత్తం మీద రొమాంటిక్ కామెడీ మూవీలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ చేశాడని అనుకుంటే.. ఇప్పుడు మరిన్ని ట్విస్టులు తీసుకొచ్చేశాడు దర్శకుడు.
Tags:    

Similar News