ఈ ఏడాదిలో అందరూ వెయిటింగు లిస్టులో రాసుకున్న మరో సినిమా.. ''జ్యో అచ్యుతానంద''. ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉండోబోతోంది అనే హైప్ ఆల్రెడీ బాగానే క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ఎప్పుడైతే ఊహలు గుసగుసలాడే వంటి క్లీన్ రొమాంటిక్ ఎంటర్టయినర్ అందించిన శ్రీనివాస్ అవసరాల ఈ సినిమాను తీస్తున్నాడో.. అప్పుడే అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ట్రైలర్ ను చూస్తే.. ఈ సినిమాలో నారా రోహిత్ అండ్ నాగ శౌర్య అనే ఇద్దరు అన్నదమ్ములు.. ఒకే అమ్మాయిని ప్రేమించడం.. చివరకు ఆ అమ్మాయి ఎవరికి దక్కుతుంది అనేదే కథగా ఊహించుకోవచ్చు. కాని అసలు కథే వేరు అంటున్నాడు అవసరాల. ''ఈ సినిమాలో ముఖ్యమైన కథ అంతా అన్నదమ్ములదే. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ మాత్రం కాదు. ఇద్దరి బ్రదర్స్ తాలూకు లైఫ్'' అని చెప్పాడు. అంతే కాదు.. అసలు ఈ కథ ఎలా పుట్టిందీ అనే విషయం చెబుతూ.. ''కంచె సినిమా కోసం జార్జియాలో షూటింగ్ చేస్తున్నప్పుడు చేతులు విరిగాయి. చిన్నపాటి సర్జరీ కోసం వీల్ చైర్ లో హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. ఇంకో 10 నిమిషాల్లో ఎనస్తీషియా (మత్తు మందు) ఇస్తారనగా.. ఈ కథ తాలూకు ఆలోచన నా బుర్రలో వెలిగింది. మత్తులో నుండి బయటకొచ్చాక మర్చిపోతానేమో అనుకున్నాను'' అంటున్నాడీ దర్శకుడు.
అయితే ఈ సినిమాలో నటించడానికి తనకు ముందుగా సినిమా చేద్దాం అని మాటిచ్చిన హీరోలెవ్వరూ ముందుకు రాలేదని.. చివరకు నారా రోహిత్ తొలి అడుగు వేయడం.. తరువాత నాగ శౌర్య ఒప్పుకోవడం జరిగిందని చెప్పాడు. కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకుందాం అనుకుంటే.. రెజీనా తో చేయాల్సొచ్చిందట.