జ్యో అచ్యుతానంద.. ఎవరో అనుకుంటే ఇంకెవరో

Update: 2016-09-07 22:30 GMT
‘జ్యో అచ్యుతానంద’ సినిమాకు నారా రోహిత్-నాగశౌర్య-రెజీనాల నటన.. వీళ్ల స్క్రీన్ ప్రెజెన్సే ప్రధాన ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు అందరూ. ట్రైలర్లో ఈ ముగ్గురూ కూడా అంతగా ఆకట్టుకున్నారు. ఐతే నిజానికి అవసరాల తన కథకు ముందు అనుకున్న నటీనటులు వేరట. హీరోల పేర్లు చెప్పలేదు కానీ.. కొంచెం పెద్ద హీరోలనే ట్రై చేసినట్లున్నాడు అవసరాల. వాళ్లు ఒప్పుకోకపోవడానికి కారణమేంటో కూడా చెప్పాడతను. అలాగే హీరోయిన్‌ గా కొత్తమ్మాయిని తీసుకుందామనుకుని.. తర్వాత రెజీనాను ఎంచుకున్నాడట.

‘‘స్టార్ హీరోలు మ‌ల్టీస్టార‌ర్లు చేస్తే ఆ సినిమా రిజ‌ల్ట్ తేడా వ‌చ్చినా వాళ్ల కెరీర్‌ కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. అయితే నా కథకు అప్ క‌మింగ్ హీరోలే కావాలి. అప్ క‌మింగ్ హీరోలు ఇలాంటి సినిమా చేయ‌డం కాస్త రిస్క్. అందుకే వాళ్లు ముందుకు రాలేదేమో అనిపించింది. ఐతే నారా రోహిత్‌ కు కథ చెప్పినపుడు అతను కూడా ఒప్పుకోడేమో అనుకున్నా. కానీ అతను ఓకే అన్నాడు. నాగశౌర్యతో ఎలాంటి ఇబ్బందీ లేదు. హీరోయిన్ పాత్రను ముందు కొత్త అమ్మాయితో చేయించాలనుకున్నాం. చాలా మందిని చూశాం. హైద‌రాబాద్ - చెన్నై - ముంబాయి... ఇలా చాలా సిటీలకు చెందిన అమ్మాయిల్ని పరిశీలించాం. క్యారెక్ట‌ర్‌ కు త‌గ్గ‌ట్లు కాన్ఫిడెంట్‌ గా ఎవ‌రూ క‌నిపించ‌లేదు. చివరికి ఆ పాత్రకు రెజీనా అయితే బాగుంటుందనిపించి సెలక్ట్ చేశాం’’ అని అవసరాల అన్నాడు.
Tags:    

Similar News