మొదటి నుంచి లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ ని పక్కా ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వచ్చిన రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే దానికి కావాల్సిన బజ్ ని సోషల్ మీడియా సహాయంతో తెచ్చేసుకున్నాడు. తన మీద ఎంత నెగటివ్ ఇమేజ్ ఉన్నా ఒక్క ట్రైలర్ రెండు పాటలతో వాటిని అమాంతం కవర్ చేసుకుని విడుదల కోసం రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా ఇందాక అవసరం అవసరం అంటూ సాగే పాటను వర్మ రిలీజ్ చేశాడు.
ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకున్నాక ఎదురుకున్న పరిణామాలు తద్వారా ఆయన అనుభవించిన మానసిక క్షోభను గీత రచయిత సిరాశ్రీ అక్షరాలలో పొందుపరచగా సింపుల్ ట్యూన్ తో క్యాచీగా కళ్యాణి మాలిక్ కంపోజ్ చేసారు. విల్సన్ హెరాల్డ్ గొంతు సరిగ్గా అతికినట్టు సరిపోయింది. విడుదలైన నిమిషాలలోనే దీనికి లైకులు కామెంట్లు హోరెత్తుతున్నాయి
ఎన్టీఆర్ పక్కనే ఉండి గోతులు తీసినవారి గురించి వర్మ ఇందులో ఘాటైన సాహిత్యం రాయించాడు. అవసరం చుట్టే సమాజం తిరుగుతుందని అధికారం ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా నీడనిచ్చి చెట్టు మోడువారిన తర్వాత ఎవరికి ఉండదు అవసరం ఇలా లిరిక్స్ మొత్తం మంచి ఘాటైన భావజాలంతో సాగింది.
గుండెల్లో గునపాలు దించి మనిషి పోయాక విగ్రహాలకు దండ వేయడం అవసరం అనే లైన్ వచ్చినప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసే షాట్ ని చూపించడం విశేషం. మొత్తానికి ఈ పాట ద్వా తన ఉద్దేశాన్ని సినిమాలో ఏం ఉండబోతోందనే క్లారిటీని మరోసారి ఇచ్చిన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మ్యూజిక్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు పాటలకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ ని బట్టి అర్థమవుతోంది
Full View