బోరింగ్ మూవీ.. ఇండియాలో రికార్డ్ కొట్టేసింది

Update: 2023-01-22 08:40 GMT
హాలీవుడ్‌ సినిమాలు ఇండియాలో వందల కోట్ల వసూళ్లను నమోదు చేయడం కొత్తేం కాదు. టైటానిక్ మొదలుకుని పదుల సంఖ్యలో హాలీవుడ్‌ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు కాస్త అటు ఇటుగా వసూళ్లు చేశాయి. ఇప్పటి వరకు అవెంజర్స్‌ : ఎండ్‌ గేమ్‌ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్ వద్ద నెం.1 సినిమాగా ఉంది.

అవెంజర్స్ : ఎండ్ గేమ్‌ సినిమా రూ.367 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. ఆ రికార్డును తాజాగా అవతార్ బ్రేక్ చేసింది. తాజా వీకెండ్‌ లో అవతార్ 2 కు భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. దాంతో ఇప్పటికే 368 కోట్ల వసూళ్లను అవతార్ 2 సొంతం చేసుకున్నట్లుగా ఇండియన్ బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్నారు.

హాలీవుడ్‌ సినిమాల్లో ఇండియన్ బాక్సాఫీస్‌ వద్ద నెం.1 స్థానంలో అవతార్ 2 నిలిచింది. ఆ తర్వాత అవెంజర్స్‌ : ఎండ్ గేమ్‌ నిలిచింది. చాలా తక్కువ సమయంలోనే అవెంజర్స్‌ నెం.2 స్థానానికి చేరింది. అవతార్ 2 విడుదల అయిన సమయంలో రికార్డు సొంతం చేసుకుంటుందని భావించలేదు.

ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ డాలర్లను ఈ సినిమా సొంతం చేసుకునేందుకు కింద మీద పడింది. మూడు బిలియన్ డాలర్ల టార్గెట్‌ తో వరల్డ్‌ బాక్సాఫీస్ వద్దకు వచ్చిన అవతార్‌ 2 ఇప్పటి వరకు 2.1 బిలియన్‌ డాలర్లను రాబట్టిందని సమాచారం అందుతోంది.

అంతర్జాతీయ స్థాయిలో అవతార్ 2 రికార్డును నమోదు చేయలేక పోయింది. కానీ ఇండియన్ హాలీవుడ్‌ సినిమాల ప్రేమికులు బాగాలేదు అంటూనే అవతార్ 2 కి నెం.1 స్థానాన్ని కట్టబెట్టారు. మరో రెండు వారాల పాటు ఇదే స్థాయిలో నిలకడగా వసూళ్లు నమోదు చేస్తే 400 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ మైల్‌ స్టోన్ ను చేరే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద నెం.1 స్థానంలో అవతార్‌ 2.92 బిలియన్ డాలర్లతో నిలువగా.. అవెంజర్స్ 2.79 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉంది. ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చిన టైటానిక్ సినిమా ఇప్పటికి కూడా 2.188 బిలియన్ డాలర్లతో టాప్ పొజిషన్ లో ఉంది. కానీ అవతార్ 2 మాత్రం తన రికార్డును తాను కూడా బ్రేక్ చేయలేక పోయింది.
Tags:    

Similar News