అవతార్ 2 సెన్సార్ రిపోర్ట్.. నిడివి ఎంతంటే?

Update: 2022-12-09 08:30 GMT
జేమ్స్ కెమెరూన్ అద్భుత సృష్టి అవతార్ 1 సినిమాకు కొనసాగింపుగా ఇప్పుడు సెకండ్ పార్ట్ భారీ స్థాయిలో విడుదలకాబోతున్న విషయం తెలిసిందే. అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్ అనే టైటిల్ తో రానున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా ఇండియాలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో సక్సెస్ అవుతుంది అని డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీ స్థాయిలోనే విడుదల చేస్తున్నారు.

3D టెక్నాలజీతో ఈసారి మరింత విజువల్ ట్రీట్ అందించే విధంగా ఈ సినిమాను తెరపైకే తీసుకువచ్చినట్లుగా జేమ్స్ కెమెరూన్ వరుస ఇంటర్వ్యూలతో ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పూర్తయ్యాయి. వరల్డ్ వైడ్ గా అవతార్ 2 సినిమా డిసెంబర్ 16వ తేదీన విడుదల కాబోతోంది. అయితే ఇండియాలో కూడా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయి.

ఈ సినిమా మొత్తంగా 192 నిమిషాల 10 సెకండ్ల నిడివితో వెండితెర పైకి రాబోతోంది. ఒక విధంగా మొదటి పార్ట్ కంటే ఇది చాలా ఎక్కువ అని చెప్పాలి. మూడు గంటలకు పైగా సినిమా కంటెంట్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీ స్థాయిలో అబ్బురపరిచే విధంగా ఉంటాయి అని చెప్పవచ్చు.

సాధారణంగా హాలీవుడ్ సినిమాల రన్ టైమ్ అయితే ఈ రేంజ్ లో ఉండేది చాలా తక్కువ. కానీ అవతార్ సినిమా చాలా ప్రత్యేకంగా కాబట్టి మూడు గంటలకు పైగా జేమ్స్ కెమెరూన్ వీక్షకులను కట్టిపడేయాలి  అని ఫిక్స్ అయ్యాడు.

ఇక అవతార్ మొదటి భాగం 162 నిమిషాల నిడివితో వచ్చిన విషయం తెలిసిందే. ఇక అవతార్ 2 సినిమా సక్సెస్ అయితేనే కొనసాగింపుగా పార్ట్ 5 వరకు మరిన్ని కథలు వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా జేమ్స్ కెమెరూన్ ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చాడు.

ఇక ఇండియాలో కూడా అవతార్ 2 సినిమా భారీ స్థాయిలో బిజినెస్ అయితే చేయబోతోంది. కేవలం తెలుగులోని సినిమా 100 కోట్ల మార్కెట్ డిమాండ్ చేస్తుంది. దీంతో ఇండియా మొత్తంలో సినిమా 500 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకున్నా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అనే విధంగా బాక్సాఫీస్ పండితుల అంచనా వేస్తున్నారు. మరి అవతార్ 2 సినిమా కంటెంట్ పరంగా ఎంతవరకు ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News