అవతార్ 2 ఇండియన్‌ ప్రీమియర్ టాక్‌ వచ్చేసింది

Update: 2022-12-14 05:30 GMT
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వరల్డ్స్ బిగ్గెస్ట్‌ విజువల్ వండర్‌ అవతార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఇప్పటికే ప్రపంచం లో పలు దేశాల్లో ప్రీమియర్‌ షో లు పడుతున్నారు. సెన్సార్ షో లకే మంచి స్పందన రావడంతో ఇప్పుడు ప్రీమియర్ షో ల టాక్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది.

ఇండియాలో అవతార్ 2 ప్రీమియర్ షో పడింది. బాలీవుడ్ ప్రముఖులతో పాటు డిస్నీ వారు మరియు మీడియా వారి కోసం ప్రత్యేకంగా వేసిన అవతార్ 2 ప్రీమియర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి అవతార్ తో పోల్చితే ఈ అవతార్ మరో లోకానికి ప్రేక్షకులను తీసుకు వెళ్లినట్లు విజువల్స్ ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

సినిమాలోని ప్రతి అయిదు నిమిషాలకు విజువల్‌ థ్రిల్లర్ మూమెంట్స్ ఉన్నాయట. ఇక ఈ సినిమాను 3డి లో ఎక్స్ పీరియన్స్ చేయడం మరో అద్భుతం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి అవతార్ 2 సినిమా విడుదలకు ముందే సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుంది. కచ్చితంగా కలెక్షన్స్ విషయంలో మరో లెవల్‌ లో ఉండటం ఖాయం అనిపిస్తుంది.

ఇదే సమయంలో అవతార్ 3 గురించిన ఆసక్తికర వ్యాఖ్యలను దర్శకుడు జేమ్స్ కామెరున్‌ చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వచ్చే సంవత్సరం డిసెంబర్ 20న అవతార్ 3 ను విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు. విజువల్స్ విషయంలో అత్యాధునిక టెక్నాలజీ వాడినట్లుగా కూడా ఆయన పేర్కొన్నాడు.

అవతార్ 3 తోనే ఆగిపోకుండా 2028 సంవత్సరం వరకు వరుసగా అవతార్ సిరీస్ లో సినిమాలు వస్తాయి అంటూ సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున అవతార్ సినిమాల రిలీజ్ ఉండబోతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరే సినిమా గురించి కూడా చర్చ జరగకుండా పూర్తిగా అవతార్ నామ జపమే అయ్యే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News