ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూసిన జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్ 2' ఈ శుక్రవారం థియేటర్లలోకి రానే వచ్చేసింది. దాదాపు 13 ఏళ్ల విరామం తరువాత జేమ్స్ కెమెరూన్ 'అవతార్' కు సీక్వెల్ గా చేసిన సినిమా ఇది. గత కొంత కాలంగా అదిగో ఇదుగో అంటూ ఊరిస్తూ వచ్చిన 'అవతార్ 2' ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రపంచ సినీ చరిత్రలో ఏ సినిమా విడుదల కాని భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది.
విజువల్ వండర్ గా సముద్ర నేపథ్యంలో తెరకెక్కిన 'అవతార్ 2' రిలీజ్ కు కొన్ని గంటల ముందే పైరసీకి గురై మేకర్స్ కి షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని దక్కించుకున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే కొంత మంది మాత్రం ఈ మూవీని థియేటర్లలో కంటే ముందే ఫ్రీగా పైరసీలో చూడాలనే ఆలోచనతో ఈ మూవీని పైరసీ చేసేశారు. ఆన్ లైన్ లో 'అవతార్ 2' పైరసీ హల్ చల్ చేస్తూ అందరినీ షాక్ కు గురిచేసింది.
పక్కా ప్రణాళికతో ప్రీమియర్ లని పలు దేశాల్లో నిర్వమించిన కొన్ని గంటల్లోనే ఈ మూవీ పైరసీకి గురి కావడంతో ఎక్కడి నుంచి లీక్ చేశారనే చర్చ మొదలైంది. ఈ మూవీకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా 16,500 కోట్లు వసూళ్లని రాబట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. అయితే ఇప్పుడు పైరసీ కావడంతో చాలా దేశాలలో ఈ మూవీని చాలా మంది వీక్షకులు ఫ్రీగా చూసేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
టెలిగ్రామ్ లోనూ లీక్ అయిన ఈ మూవీ బిగ్ స్క్రీన్ పై చూసిన అనుభూతిని మాత్రం కలిగించదన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అది తెలిసి కూడా 'అవాతార్ 2' ని పైరసీ చేయడం అన్నది వారి మూర్ఖత్వమే అవుతుందని అవతార్ 2 అభిమానులు అంటున్నారు.
ఇలాంటి విజువల్ వండర్ ని భారీ కాన్వాస్ పై చూస్తేనే ఆ మజా. అలా కాకుండా పైరసీలో చూస్తే ఆ మజా.. ఫీల్ కలగదు. దీంతో పైరసీలో చూసిన వారు కూడా ఆ విజువల్స్ ని వెండితెరపై బిగ్ స్క్రీన్ లో చూడాలని థియేటర్ కి రావాల్సిందే.
మల్టీప్లెక్స్ థియేటర్లలో మాత్రమే చూసే విజువల్ వండర్ ని సాధారణ పైరసీలో చూస్తే ఆ ఇంపాక్ట్ వుండదని, ఖచ్చితంగా మళ్లీ అలా చూసిన ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్లకు పోటెత్తడం ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో లీకైన పైరసీ ప్రింట్ 'అవతార్ 2' కు ఎలాంటి హానీ చేయకపోగా మరింత మందిని థియేటర్లకు రప్పించడం ఖాయం. సినిమా నిడివి, ట్విస్ట్ ల విషయంలో కొంత నెగెటివ్ టాక్ వున్నా విజువల్స్, ఎమోషన్స్ పరంగా ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడం కాయంగా కనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.