జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజై సంచలనాలు సృష్టిస్తుంది. సినిమా నిడివి కొద్దిగా ఎక్కువ అనిపించినా సినిమాని చూసిన ఆడియన్స్ అంతా కూడా సూపర్ అనేస్తున్నారు. ముఖ్యంగా త్రీడీ వర్షన్ లో ఈ సినిమా చూడాలని ప్రత్యేకంగా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. అవతార్ తర్వాత 13 ఏళ్లగా అవతార్ 2 మీద పనిచేశారు జేమ్స్ కామెరూన్. సినిమాలో ప్రతి ఒక్కటి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని అంటున్నారు.
ఇక వరల్డ్ వైడ్ గా అవతార్ 2 వసూళ్ల పరంగా దూకుడు చూపిస్తుంది. ఫస్ట్ డేనే 160 మిలియన్ డాలర్స్ వసూలు చేసిన అవతార్ 2, 3 డేస్ లో 434 మిలియన్ డాలర్స్ రీచ్ అయినట్టు చెబుతున్నారు. ఈ సినిమాని 3 వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాడు జేమ్స్ కామెరూన్. అయితే అదే స్థాయిలో బిజినెస్ కూడా జరిగింది. ఎవరు ఊహించని విధంగా 2 బిలియన్ డాలర్ల బిజినెస్ జరిగిందట. ఈ విషయాన్ని జేమ్స్ కామెరూన్ చెప్పాడు. అంటే మన లెక్కలో చెప్పాలంటే 16 వేల కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.
వీకెండ్ 400 మిలియన్ డాలర్లు తెచ్చింది అంటే.. మా అంటే 500 మిలియన్ డాలర్లు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కానీ అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలంటే మాత్రం నెల రోజుల పాటు ఇదే దూకుడు కొనసాగించాలి. ఫుల్ రన్ లో 1.5 బిలియన్ డాలర్లు అయినా తెస్తుందా అని డౌట్ పడుతున్నారు సినీ విశ్లేషకులు.
ఇక తెలుగు రెండు రాష్ట్రాల్లో అవతార్ 2 ప్రభంజనాలు సృష్టిస్తుంది. మొదటి రోజు 35 కోట్ల గ్రాస్ తో సెన్సేషన్ అనిపించుకుంది అవతార్ 2. తెలుగు రాష్ట్రాల్లో అవతార్ మీద ఉన్న క్రేజ్ ఎలాంటిది అన్నది ఈ సినిమా వసూళ్లని చూస్తే అర్ధమవుతుంది. ఇండియా వైడ్ గా కూడా అవతార్ 2 వసూళ్లు అదరగొడుతున్నాయి. అవతార్ 2 అనుకున్న విధంగా అనుకున్న టార్గెట్ రీచ్ అయితేనే అవతార్ 4, 5 తీస్తానని అన్నారు జేమ్స్ కామెరూన్. అవతార్ 4 కి ఆల్రెడీ కొంత పార్ట్ షూట్ చేసి ఉన్నారు కాబట్టి అవతార్ 3 కచ్చితంగా వస్తుంది.