ఇంకా టాప్‌ 5 లో చేరని అవతార్ 2

Update: 2023-01-21 02:30 GMT
హాలీవుడ్‌ సినీ మాంత్రికుడు జేమ్స్ కామెరూన్ అవతార్ 2 తో ప్రపంచాన్ని మొత్తం ఉర్రూతలూగిస్తాడని అంతా భావించారు. గత ఏడాది కాలంగా ప్రపంచ సినీ ప్రేక్షకులు అవతార్ 2 కోసం వెయిట్‌ చేశారు. చాలా సంవత్సరాల క్రితం వచ్చిన అవతార్ సినిమా అప్పట్లోనే 2.92 బిలియన్‌ డాలర్లను వసూళ్లు చేసింది.

సహజంగానే అవతార్ 2 సినిమా ఈజీగా 3 బిలియన్‌ డాలర్లను వసూళ్లు చేస్తుందని ప్రేక్షకులు భావించారు. కానీ పరిస్థితి చూస్తూ ఉంటే అవతార్ 2 సినిమా కనీసం 2.5 బిలియన్ డాలర్లను కూడా వసూళ్లు చేసే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రపంచ వ్యాప్తంగా ఆల్ టైమ్‌ అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ 5 చిత్రాల జాబితాలో అవతార్‌ ఇంకా చోటు దక్కించుకోలేక పోయింది. ప్రస్తుతం 1.903 బిలియన్ డాలర్ల వసూళ్లతో 6వ స్థానంలో ఉంది.

మరికొన్ని దేశాల్లో అవతార్ 2 విడుదలకు సిద్ధం అవుతుండగా.. ఇంకా కొన్ని దేశాల్లో సినిమా ఆడుతూనే ఉంది.

మరో నెల నుండి రెండు నెలల పాటు అవతార్ 2 యొక్క సందడి కనిపించే అవకాశం ఉంది. అలా జరిగినా కూడా మరో  50 మిలియన్ ల వరకు వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని.. అలా చూసుకున్నా కూడా అవతార్ 2 యొక్క కలెక్షన్స్‌ తక్కువ అన్నట్లే అంటూ సినీ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

ఆల్‌ టైమ్‌ అత్యధిక వసూళ్ల జాబితాలో నెం.1 స్థానంలో అవతార్ 2.92 బిలియన్ డాలర్లతో నిలిచింది. ఆ తర్వాత అవెంజర్స్‌ : ఎండ్‌ గేమ్‌ చిత్రం 2.79 బిలియన్ డాలర్లను సొంతం చేసుకుని రెండవ స్థానంలో ఉంది. 2.2 బిలియన్‌ డాలర్లతో టైటానిక్ మూడవ స్థానంలో ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News