బాహుబలి 2 రిలీజ్ అనంతరం `రామాయణం 3డి` సెట్స్ కెళ్లనుందని ప్రచారమైంది. ఆ తర్వాత ఇందులో నటించే స్టార్ల గురించి కూడా తామరతంపరగా గుసగుసలు వినిపించాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ఈ ట్రయాలజీ చిత్రానికి అల్లు అరవింద్- మధు మంతెన- నమిత్ మల్హోత్రా సంయుక్తంగా దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమయ్యారని రెండేళ్ల క్రితం మరోసారి వార్తలొచ్చాయి.
అయితే ఈ సినిమాలో రాముని పాత్ర ఇంకా ఖరారు కాలేదని.. హృతిక్ రోషన్ రావణుడి పాత్రలో నటిస్తే.. దీపిక పదుకొనే సీతాదేవి పాత్రలో నటిస్తారని కథనాలొచ్చాయి. ఇటీవలి గుసగుసల ప్రకారం ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీరాముడిగా నటిస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఆంజనేయుడు.. లక్ష్మణుడు.. భరత శత్రుఘ్నుల పాత్రలకు వాలి సుగ్రీవుల పాత్రలకు కూడా ఎంపికలు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ అవతార్ కి పనిచేసిన కాస్ట్యూమ్ డిజైనర్ల బృందం రామాయణం చిత్రానికి పని చేస్తుందని.. హృతిక్ రావణ్ పాత్ర కోసం డిజైన్స్ రూపొందించడానికి ముందుకు వచ్చిందని తెలిసింది. అయితే ఏదైనా అల్లు కాంపౌండ్ అధికారికంగా ప్రకటిస్తేనే అది నిజం అని నమ్మాల్సి ఉంటుంది.