విశ్వ‌క్ సేన్ పై జ‌పాన్ గాళ్ అభిమానం అంటే ఇలా!

కానీ అలాంటి అభిమానం మీకే కాదు మాకు సొంత‌మే అని మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ గ‌త ఏడాదే చాటి చెప్పాడు.

Update: 2025-02-13 12:16 GMT

ప్ర‌భాస్ , రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల‌కు విదేశాల్లోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. అక్క‌డా ల‌క్ష‌లాది మంది అభిమానించే స్టార్లు. కానీ అలాంటి అభిమానం మీకే కాదు మాకు సొంత‌మే అని మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ గ‌త ఏడాదే చాటి చెప్పాడు. గతేడాది జపాన్ నుంచి కొంతమంది హైదరాదాబ్ వచ్చి మరీ విశ్వక్‌ని కలిసిన సంగతి తెలిసిందే. దీంతో విశ్వ‌క్ తెలుగు అభిమానులంతా స్ట‌న్ అయిపోయారు.

మనోడి ఫాలోయింగ్ అప్పుడే జ‌పాన్ వ‌ర‌కూ కూడా పాకిందా? అని ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ నేప‌థ్యంలో తాజాగా విశ్వ‌క్ మ‌రోసారి స‌ర్ ప్రైజ్ చేసాడు. ఆయ‌న హీరోగా న‌టించిన `లైలా` రిలీజ్ నేప‌థ్యంలో మ‌రోసారి జపాన్ అభిమానులు విశ్వక్ ని కలిసారు. విశ్వ‌క్ సేన్ కోసం జాప‌న్ నుంచి ఓ లేడీ అభిమాని త‌న తండ్రితో పాటు హైద‌రాబాద్ కు వ‌చ్చింది. ఒక్క‌సారిగా విశ్వ‌క్ ని గేట్ వ‌ద్ద చూడ‌గానే ఆ జ‌పాన్ అమ్మాయి భావోద్వేగానికి గురైంది.

అభిమాన న‌టుడిని చూస్తూ మురిసిపోయింది. ముసి ముసి న‌వ్వులు న‌వ్వి సిగ్గులొల‌క‌బోసింది. గ‌త ఏడాది క‌లిసి జ‌పాన్ అమ్మాయిల బ్యాచ్ లో ఈ బ్యూటీ కూడా ఉంది. దీంతో విశ్వ‌క్ ఆ అమ్మాయిని వెంట‌నే గుర్తు ప‌ట్టాడు. క‌మ్ క‌మ్ అంట లోప‌లికి ఆహ్వానించాడు. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నాకు బొమ్మలు తెచ్చావ్ కదా? ఈసారి ఏం తెచ్చినవ్ అంటూ సరదాగా అడిగాడు. దీంతో విశ్వ‌క్ కోసం తెచ్చిన కేక్, లెట‌ర్ ఇచ్చింది ఆ జపాన్ అమ్మాయి.

ఆ లెట‌ర్ జ‌ప‌నీస్ లో ఉండ‌టంతో ట్రాన్స‌లేట్ చేయించుకుని వింటా అని చెప్పాడు. ఇంకా కాసేపు వాళ్ల‌తో మాట్లాడి ఫోటోలు దిగాడు. అనంత‌రం త‌న సోద‌రి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌మ‌ని చెప్పాడు. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. నిజంగా ఇలా విదేశీ అభిమానులు సంపాదించుకోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు. అభిమా నానికి సరిహద్దులు లేవని విశ్వక్ భాయ్ కూడా నిరూపించాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News