పాన్ ఇండియా చిత్రం కీలక షెడ్యూల్ రద్దు!
`కేజీఎఫ్` తర్వాత రాకింగ్ స్టార్ యశ్ `టాక్సిక్` కోసం ఎంతగా శ్రమిస్తున్నాడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు.
`కేజీఎఫ్` తర్వాత రాకింగ్ స్టార్ యశ్ `టాక్సిక్` కోసం ఎంతగా శ్రమిస్తున్నాడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. స్క్రిప్ట్ పైనే గీతూ మోహన్ దాస్ తో కలిసి రెండేళ్లు పనిచేసాడు. స్క్రిప్ట్ అంతా పర్పెక్ట్ గా అనుకున్న తర్వాత పట్టాలె క్కించారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. టీజర్ కూడా రిలీజ్ చేసారు. అయితే టీజర్ కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. రోటీన్ టీజర్ గానే హైలైట్ అయింది. ఆ తర్వాత యధావిధిగా షూటింగ్ కొనసాగించారు.
అయితే తాజాగా ఓ షెడ్యూల్ ని మొత్తం రద్దు చేసినట్లు తెలిసింది. ఆ షెడ్యూల్ ఔట్ ఫుట్ విషయంలో యశ్ పెర్పార్మెన్స్ పై అసంతృప్తిగా ఉండటంతో మొత్తం రద్దు చేసి మళ్లీ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారుట. ఇటీవలే బెంగుళూరులో ఓ షెడ్యూల్ పూర్తయింది. కొత్త షెడ్యూల్ ని ముంబైలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంటే బెంగుళూరు షెడ్యూల్ కంటే ముందే ప్లాన్ చేసిన షెడ్యూల్ రద్దయినట్లు తెలుస్తోంది.
అందులో యశ్ సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మళ్లీ వాటిని కొత్త షెడ్యూల్ లో పూర్తి చేయనున్నారు. ఓ షెడ్యూల్ రద్దయిందంటే కోట్లలో నష్టం వస్తుంది. అయినా కెవిఎన్ ప్రొడక్షన్స్- మోన్ స్టార్ మైండ్ క్రియేషన్స్ ఆ నష్టాలను పట్టించుకోకుండా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కి పూర్తి స్వేచ్ఛనిచ్చి పనిచేయిం చుకుంటున్నారు. సాధారణంగా ఇలాంటి సన్నివేశం తలెత్తినప్పుడు దర్శక, నిర్మాతల మధ్య క్లాషెస్ ఏర్పడు తుంటాయి.
కానీ కేవీఎన్ వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తుంది. ఈ చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రద్దయిన షెడ్యూల్ నేపథ్యంలో ఇప్పుడా ఖర్చు అదనంగా పెరుగుతుంది. యశ్ కి పాన్ ఇండియాలో ఎనలేని క్రేజ్ ఉంది. 1000 కోట్లకు పైగా వసూళ్లు తేగల సత్తా ఉన్న నటుడు.