24 గంటలు.. 29 మిలియన్ల వ్యూస్..!
కింగ్ డమ్ అంటూ కథ గురించి పెద్దగా క్లూ ఇవ్వకపోయినా సరే విజయ్ దేవరకొండ పాత్రలో రకరకాల వేరియేషన్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా కింగ్ డమ్. బుధవారం ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎలాంటి సినిమా అయితే కోరుతున్నారో దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ టీజర్ ఉంది. కింగ్ డమ్ అంటూ కథ గురించి పెద్దగా క్లూ ఇవ్వకపోయినా సరే విజయ్ దేవరకొండ పాత్రలో రకరకాల వేరియేషన్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
జస్ట్ టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించారు మేకర్స్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పర్ఫెక్ట్ మాస్ బొమ్మగా కింగ్ డమ్ రాబోతుంది. ఈ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే 24 గంటల్లో టీజర్ 29 మిలియన్ల వ్యూస్ తో టాప్ ట్రెడింగ్ లో ఉన్నది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కింగ్ డమ్ టీజర్ తో సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఇది కదా విజయ్ దేవరకొండ అసలైన స్టామినా అంటూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని తెలియచేస్తున్నారు.
స్టార్ సినిమాల టీజర్ల రికార్డుకి ఏమాత్రం తీసిపోని విధంగా విజయ్ దేవరకొండ కింగ్ డమ్ టీజర్ రికార్డులు సృష్టిస్తుంది. సినిమాపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ టీజర్ వచ్చిందని చెప్పొచ్చు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ కింగ్ డమ్ సినిమా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ అందించేందుకు వస్తుంది. ఈ సినిమా గురించి నిర్మాత ఇంతకుముందే ఎవరు ఊహించని విధంగా ఉంటుందని హింట్స్ ఇచ్చాడు.
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ సినిమాకు హిట్ టాక్ వచ్చి చాలా రోజులైంది. అతను పర్ఫెక్ట్ హిట్ కొడితే ఎలా ఉంటుందో చూడాలని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. మరి విజయ్ దేవరకొండకు కింగ్ డమ్ రూపంలో బ్లాక్ బస్టర్ వస్తుందా లేదా అన్నది మే 30న తెలుస్తుంది. టీజర్ లో ఉన్న స్టఫ్ చూస్తే సినిమా ష్యూర్ షాట్ హిట్ అనేలా ఉంది. టీజర్ కి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అన్నది చూడాలి.