సూపర్ విలన్... వారిని అడ్డుకునే సూపర్ హీరోలు అవెంజర్స్ సినిమాలన్నీ ఇలాగే ఉంటాయి. సూపర్ హీరోలంటే యాక్షన్ సన్నివేశాలు కాబట్టి కచ్చితంగా పెద్దలకు పిల్లలకు తెగ నచ్చేస్తుంది. కమర్షియల్ సినిమాలన్నింటికీ బాబు లాంటి అవెంజర్స్ ద ఇన్ఫినిటీ వార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల క్రితమే విడుదలై కలెక్షన్లను బాగానే రాబడుతోంది. అయితే సినిమాకు సంబంధించిన రివ్యూలు మాత్రం భిన్నంగా ఉంటున్నాయి. కొందరికి సినిమా అద్భుతంగా అనిపిస్తే... మరికొందరికి ఫర్వాలేదనిపించింది. ఎవరికెలా అనిపించినా అందులోని సూపర్ విలన్ థానోస్ మాత్రం సినీ జనాలందరికీ పిచ్చిపిచ్చిగా నచ్చేశాడు. ఏం మేకప్ ఏ యాక్టింగ్ అని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
భారీకాయుడైన ధానోస్ భూమిని వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకు ఆయన ఆరు మహిమ గల మణులు కావాలి. వాటిని చేజిక్కించుకునే క్రమంలో సూపర్ హీరోలతో తలపడతాడు. పిల్లలకు నచ్చే సూపర్ హీరోలంతా ఈ సినిమాలో మూకుమ్మడిగా ఒకేసారి కనిపిస్తారు కనుక వారికి కన్నుల పండగే. వారిలో కొందరికి ముఖ్య పాత్రలే దక్కిన కొందరు సూపర్ హీరోలు మాత్రం చిన్న చిన్న సన్నివేశాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సూపర్ హీరో థోర్ కు మాత్రం ఎక్కువ మార్కులే పడ్డాయి సినిమాలో. అతను తన ఆయుధాన్ని మళ్లీ తయారుచేసుకుని థానోస్ మీద యుధ్దానికి సిద్దమైనప్పుడు ప్రతి యాక్షన్ ప్రేమికుడి ఒళ్లు జలదరిస్తుంది. ఇక హల్క్ స్పైడర్ మ్యాన్ అలా కనిపించి ఇలా వెళ్లిపోతారు. క్లైమాక్స్‌ను ఓ రేంజ్లో ఊహించుకున్న ప్రేక్షకుడికి మాత్రం నిరాశ మిగలడం ఖాయం.
సూపర్ విలన్ థానోస్ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. సినీ ప్రపంచానికి కొత్తగా పరిచయమైన విలన్. మేకప్ అదిరిపోయింది. సూపర్ హీరోల దగ్గర విలన్ అతి భారీ కాయుడు. మార్వెల్ కామిక్సులో ఇప్పటివరు చిన్న చిన్న పాత్రల్లోనే కనిపించాడు థానోస్. అలాంటిది అతడినే సూపర్ విలన్‌గా చేసి ఇన్ఫినిటీ వార్ సినిమా తీశారు. తెలుగులో ఆ పాత్రకు రానా డబ్బింగ్ చెప్పాడు. రానా వాయిస్ బాహుబలితో మనకు బాగా పరిచయం అయిపోయింది కనుక పెద్ద థ్రిల్ కలగదు. అయినా రానా ప్రయత్నం బాగుందనిపిస్తుంది.