నాకింకా డేటింగ్ వ‌య‌సు రాలేదు

Update: 2015-11-15 07:30 GMT
ఉయ్యాలా జంపాల చిత్రంతో టాలీవుడ్ కు  ప‌రిచ‌య‌మైంది అవికాగోర్.  తొలి సినిమాతో నే న‌టిగా మంచి గుర్తింపు ద‌క్కించుకోవ‌డంతో అవికా పేరు కుర్ర హీరోయిన్ల లో బాగా పాపుల‌ర్ అయిపోయింది. ఇట‌వ‌లే సినిమా చూపిస్తా మావ అంటూ అమ్మ‌డు మ‌రో విజ‌యం త‌న ఖాతాలో వేసుకుంది. మిగిలిన హీరోయిన్లంరికీ భిన్నంగా ఉంటూ కొన్ని నిబంధ‌న‌ల‌తో రేసులో కొన‌సాగుతోంది.  ఈ సంద‌ర్భంగా అవికా చెబుతోన్నక‌బుర్లివి...  నాకింకా ప్రేమ‌లో ప‌డేంత వ‌య‌సురాలేదు. డేటింగ్ చేసే ఆస‌క్తి లేదు. న‌టిగా నిల‌దొక్కుకోవ‌డమే నా ముందున్న ల‌క్ష్యం అంటోంది. అయితే చిన్న ప్పుడు షాహిద్ క‌పూర్  న‌టించిన ఇష్క్ విష్క్ సినిమా చూసి అత‌న్ని ప్రేమించాను అంది. ఇప్ప‌టివ‌ర‌కూ తెర‌పై గ్లామ‌ర్ డాల్ గా క‌నిపించ‌లేదు. అలా క‌నిపంచాల్సి వ‌స్తే అన్న ప్ర‌శ్న‌కు.. న‌ట‌న నా ప్రాణం. దానికోసం ఎంతైన శ్రమిస్తాను.

అయితే నేను చేసే ఏ సినిమా అయినా అన్ని వ‌ర్గాలు వారు చూసే విధంగా ఉండాలి. ముఖ్యంగా నా కుటుంబంతో క‌లిసి చూసే విధంగా ఆ సినిమా ఉండాలి. క్యారెక్ట‌ర్ డిమాండ్ చేసిందిగ‌దాని ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్లు చేయ‌డ‌మంటే నావ‌ల్ల కాద‌నేసింది. మోడ్ర‌న్ గా ఉండ‌టానికి ఎందుకు ఇష్ట‌ప‌డ‌రు?  పొట్టి దుస్తులు వేసుకోవ‌డమంటే న‌చ్చ‌దు. అవి పూర్తిగా నాకు అసౌక‌ర్యంగా ఉంటాయి. కుర్తీ - గాగ్రా - చీర‌ల‌నే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తాను. వాటినే ధ‌రిస్తాను అంది. ప్ర‌స్తుతానికి తెలుగులో మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అలాగే హిందీలో కూడా న‌టించ‌మ‌ని అడుగుతున్నారు. రెండు భాష‌ల్లోనూ నాయిక‌గా మంచి పేరు తెచ్చుకోవాల‌ని ముగించింది.
Tags:    

Similar News