మేల్ గైన‌కాల‌జిస్ట్ ప్రేక్ష‌కుల‌కు ఏం చెప్ప‌బోతున్నాడు?

Update: 2022-10-02 15:30 GMT
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా కామెడీ టైమింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. గోవిందా త‌ర్వాత అంత‌టి హాస్యాన్ని పండించగ‌ల నటుడిగా ఆయుష్మాన్ కి పేరుంది. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా అనుభూతి క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వంలో `డాక్ట‌ర్. జి`  తెర‌కెక్కుతోంది. ఈ సినిమా ప‌క్కా కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ అని ప్ర‌చార చిత్రాలు చూస్తే తెలుస్తోంది.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆద్యంతం న‌వ్వులు పూయిస్తుంది. మ‌గ గైన‌కాల‌జిస్ట్ ఇబ్బందుల్ని ఆద్యంతం హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ గా మ‌లిచారు. ఆర్థోపెడిక్  కావాల‌నుకున్న ఆయుష్మాన్ గైన‌కాల‌జిస్ట్ అయితే ప‌రిస్థితి? ఎలా ఉంటుంద‌న్న‌ది ట్రైల‌ర్ లో ఆద్యంతం వినోదాత్మ‌కంగా మ‌లిచారు. పేషెంట్లు మ‌హిళా గైన‌కాలజిస్టుల్ని ప్రిఫ‌ర్ చేస్తారు.

ఈ ఆడ మ‌గ తేడా ఏంటి?  డాక్ట‌ర్ ఎవ‌రైనా ఒక‌టే అంటే..పెషేంట్లు అలా అనుకోరు క‌దా?  ముందు నువ్వు అనుకో?  నీ ఆలోచన మార్చుకో. నువ్వో గైన‌కాల‌జిస్టువి. నీలోని మేల్ ట‌చ్ ని వ‌దులుకో  వంటి డైలాగులు  పాత్రల విధానాన్ని హైలైట్ చేస్తుంది. దీంతో సినిమాపై అంచ‌నాలు భారీగానే ఏర్ప‌డుతున్నాయి. మ‌హిళా డాక్ట‌ర్ పాత్ర‌లో ర‌కుల్ న‌టిస్తుంది.

లేడీ గైన‌కాల‌జిస్టుల మ‌ధ్య‌లో మేల్ గైన‌కాల‌జిస్ట్ ఎలా స‌స్టేన్ అయ్యాడు? అన్న‌ది సినిమాలో ప్ర‌ధాన అంశంగా క‌నిపిస్తుంది. డాక్ట‌ర్ జి లో ప్ర‌తీ పాత్ర‌ను కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం క‌నిపిస్తుంది. డాక్ట‌ర్ నేప‌థ్య‌మున్న సినిమాలు బాలీవుడ్ లో  ఇప్ప‌టికే చాలా వ‌చ్చాయి. `మున్నాభాయ్ ఎంబీబీఎస్`.. `ఆనంద్`.. `డాక్ట‌ర్ కొట్నీస్ కీ అమ‌ర్ క‌హానీ`..`దిల్ ఏక్ మందిర్`.. `ఏక్ డాక్ట‌రీ మౌత్` ఇవ‌న్నీ డాక్ట‌ర్ వృత్తి నేప‌థ్యంగా చేసుకుని తెర‌కెక్కిన సినిమాలే.

ఇవ‌న్నీ డాక్ట‌ర్ వృత్తిని ఎంతో గొప్ప‌గా చాటాయి. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న  `డాక్ట‌ర్ జి` వైద్య వృత్తిలో సాధ‌క‌బాధ‌కాల్ని ఆద్యంతం వినోదాత్మ‌కంగా మ‌లిచిన‌ట్లు క‌నిపిస్తుంది. సినిమాలో ఏదో ఒక కీల‌క పాయింట్ త్రీ ఇడియ‌ట్స్ త‌ర‌హాలో  ఎమోష‌నల్ గా క‌నెక్ట్ అవ్వ‌డానికి ఛాన్స్ ఉంది.  త్రీ ఇడియ‌ట్స్ లో ఐఐటీ విద్యార్ధులు క‌లిసి  కాన్పు క‌ష్ట‌మైన డీన్ క‌మార్తెకు  పురుడు పోయ‌డాన్ని ఎంతో ఆస‌క్తిక‌రంగా చూపించారు.

ఓ స్ర్తీకి పురుషులు పోయ‌డం అన్న‌ది ఎంతో క‌నెక్ట్ అయింది. ఆ స‌మ‌యంలో పురుడు పోస్తుంది? ఆడ‌వాళ్లా? మ‌గ‌వాళ్లా? అన్న ఆలోచ‌న ప్రేక్షకుడి కి రాకుండా చేయ‌డంలో శంక‌ర్ ఎంతో ఎమోష‌నల్ గా కనెక్ట్ చేసారు. త‌ల్లి గ‌ర్భం నుంచి వస్తోన్న బిడ్డ‌ను  అమీర్ తొంగి చూసిన సీన్  క‌న్విన్సింగ్ గా ఉంది. ఆ సీన్ ప్రేక్ష‌కుల‌తో చప్ప‌ట్లు కొట్టింది. డాక్ట‌ర్ జీలోనూ అలాంటి ఎమోష‌న‌ల్ ఎటాచ్ మెంట్ కి ఛాన్స్ ఉంద‌ని ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. 
Tags:    

Similar News