ఈ సంవత్సరం సినిమా పరిశ్రమకు ఏమాత్రం బాగున్నట్లుగా లేదు. అన్ని బ్యాడ్ న్యూస్ లు వినాల్సి వస్తుంది. అసలే వైరస్ కారణంగా సినిమాల షూటింగ్స్ లేక.. సినిమాల విడుదల లేక నిరాశ ఆందోళనలో ఉన్న సినీ వర్గాల వారికి దెబ్బ మీ దెబ్బ షాక్ మీద షాక్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇటీవలే బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. అది మర్చిపోక ముందే మలయాళ ప్రముఖ దర్శకుడు సాచీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
ఇటీవల దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన అయ్యప్పనమ్ కోషియమ్ చిత్ర దర్శకుడు సాచీకి నిన్న రాత్రి గుండె పోటు వచ్చిందట. దాంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్ గా ఉందని వైధ్యులు ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా మలయాళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 24 గంటల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఒక క్లారిటీ వస్తుందని వైధ్యులు పేర్కొన్నారట.
గత కొన్నాళ్ల కాలంగా గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సాచి ఇప్పుడు గుండె పోటు రావడంతో కాస్త సీరియస్ గానే ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దర్శకుడిగా అయ్యప్పనమ్ కోషియమ్ చిత్రంతో సెన్షేషనల్ దర్శకుడిగా సాచి గుర్తింపు దక్కించుకున్నారు. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ చిత్రం ఏకంగా 50 కోట్ల వసూళ్లను సాధించింది. అందుకే ప్రస్తుతం ఆ సినిమాను హిందీ మరియు తమిళంలో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో కూడా రీమేక్ కోసం చర్చలు జరుగుతున్నాయి. మలయాళ సినీ వర్గాల వారితో పాటు అంతా కూడా ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నారు.