‘రోబో-2’ తర్వాత ‘వైశాఖం’కేనట

Update: 2016-10-11 15:30 GMT
ఇండియన్ సినిమాల్లో బాలీవుడ్ తర్వాత టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ పాటించేది టాలీవుడ్డే. ఏ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా వెంటనే మనోళ్లు వాడేస్తారు. ఈ విషయంలో చిన్న సినిమాల నిర్మాతలు కూడా ముందుంటారు. సీనియర్ పీఆర్వో బి.ఎ.రాజు నిర్మాణంలో బి.జయ రూపొందిస్తున్న ‘వైశాఖం’ సినిమాకు కూడా ఇలా ఓ కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారట. ‘రోబో’ సీక్వెల్ ‘2.0’కు శంకర్ కూడా ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడట.  ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు జయ.. రాజు వెల్లడించారు. హరీష్.. అవంతిక జంటగా నటిస్తున్న ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా జయ.. రాజు మాట్లాడుతూ.. ‘‘ఒక చిన్న ఎపిసోడ్ మిన‌హా మా సినిమా  షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. దీపావ‌ళికి సినిమా పూర్తవుతుంది. ఇప్ప‌టిదాకా మేం తీసిన ఆరు సినిమాల విషయంలో షూటింగ్ జరుగుతుండగా ఒక టెన్షన్ ఉండేది. కానీ ‘వైశాఖం’కు మాత్రం అలాంటిదేమీ లేకుండా ప్రతి రోజూ షూటింగ్ ఎంజాయ్ చేస్తూ చేశాం. ఈ చిత్రంలో ఎంట‌ర్టైన్మెంట్ తో పాటు మంచి సందేశం కూడా ఉంది. సాయికుమార్ కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న బిజీగా ఉన్న‌ప్ప‌టికీ మాపై ఉన్న గౌర‌వంతో ఈ క్యారెక్ట‌ర్ చేశారు. ఓ మంచి సినిమా చేస్తున్నందుకు మా యూనిట్ అంతా చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం. మా సినిమాటోగ్రాఫ‌ర్ వాలిశెట్టి సుబ్బారావు బాడీ గింబ్లి టెక్నాల‌జీని ఉప‌యోగించారు. ఈ టెక్నాలిజీని ‘2.0’కు ఉప‌యోగిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News