ఫ్రెంచ్ తీరంలో బాహుబలి సందడి

Update: 2017-05-21 09:37 GMT
బాహుబలి.. ఈ మాట నుండి ఈ సినిమా నుండి ఇప్పటికీ బయటపడటం లేదు సినీ ప్రపంచం. రాజమౌళి చెప్పిన జానపద యుద్ధ కుటంబ గాధ అందరిని అంతలా ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ యుద్ధ కథలు చాలా చూసి ఉంటారు కానీ మన దేశ బంధాలు తో కూడిన యుద్ధాలు చూసి ఉండరు అదే  బాహుబలి  కొత్తదనం అక్కడ.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది అంటే ప్రపంచం మొత్తం గొప్ప కళాకారులు దర్శకులు అందరూ ఒక్కచోట గుమిగూడి ఒకరి పనితనాన్ని మరొకరు నిండు హృదయం తో ఆనందిస్తారు. ఇప్పుడు కూడా మన బాహుబలి సినిమా ఫ్రెంచ్ ఫిల్మ్ మార్కెట్ సెగ్మెంట్ లో స్క్రీనింగ్ చేయబడింది. బాహుబలి మొదటి భాగం నిన్న అంటే మే 20 న ప్రధర్శించారు. బాహుబలి రెండో భాగం ఈ రోజు రాత్రి 8.30 కు స్క్రీనింగ్ వేస్తారు. ఈ దెబ్బతో అక్కడ ఇంటర్నేషనల్ డిస్ట్రిబుటర్స్ కు ఇండియా సినిమాను వాళ్లదగ్గర ఎలా మార్కెట్ చెయ్యాలి అని ఆలోచన రావడం ఖాయం.

ఎందుకంటే బాహుబలి 2 ఇప్పుడు 1500 కోట్ల కలెక్షన్ దాటి  1600 కోట్లు మైలురాయి కి చేరువలో ఉంది. ప్రపంచం సినిమా స్టేజ్ పై బాహుబలి సినిమా వలన ఇండియా సినిమా కు ఇంటర్నేషనల్ రేంజులో మంచి మార్కెట్ ఏర్పడింది అని చెప్పవచ్చు. ఈ క్రేజును మిగతా ఫిల్మ్ మేకర్స్ ఎలా వాడుకుంటారో చూడాలి.  

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News