‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమా మన రాష్ట్రం అవతల కూడా క్రేజ్ తెచ్చుకోవడం.. భారీ అంచనాల మధ్య విడుదలవుతుండటం మన జనాలకు ఆశ్చర్యమేమీ కలిగించట్లేదు. కానీ ఈ చిత్రం విదేశాల్లో సైతం అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకుని.. అక్కడి ప్రేక్షకుల్ని కూడా విశేషంగా ఆకర్సిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ప్రకంపనలు రేపుతోంది. దుబాయ్ లో ‘బాహుబలి: ది కంక్లూజన్’కు సంబంధించి ఇప్పటిదాకా లక్షకు పైగా టికెట్ల అమ్మకం జరిగిందట.
ఈ విషయాన్ని బాహుబలి-2ను గల్ఫ్ దేశాల్లో విడుదల చేస్తున్న ఫార్స్ ఫిలిమ్స్ అధినేత గులాన్ వెల్లడించాడు.దుబాయ్ లో బాహుబలి టీం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అతనీ సంగతి చెప్పాడు. కిందట విడుదలైన ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-8’ సినిమాకు కూడా ఇన్ని టికెట్లు అమ్మలేదని గులాన్ చెప్పడం విశేషం. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ లోని సినిమాలకు ఉండే క్రేజ్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా ఈ చిత్రం విడుదలై పది రోజులవుతున్నా.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా బాహుబలి-2కు అమ్మిన టికెట్ల కంటే తక్కువ టికెట్లే అమ్ముడయ్యాయంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. బాహుబలి-2పై దుబాయ్ లో ఇప్పటికే మంచి హైప్ ఉండగా.. రాజమౌళితో పాటు చిత్ర బృందం అక్కడ పర్యటిస్తూ హైప్ ను మరింత పెంచే ప్రయత్నంలో ఉందిప్పుడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/