‘బాహుబలి-2’లో ఆ డైలాగుల మర్మమేంటి?

Update: 2017-03-27 11:14 GMT
నిన్నటి ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సినిమాలోని  కొన్ని కీలకమైన డైలాగులు బయటికి వచ్చాయి. చాలా క్లుప్తంగా మాట్లాడిన ప్రభాస్.. వేదిక మీది నుంచి రెండు డైలాగులు పేల్చాడు. అందులో ఒకటి.. ‘‘నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా’’. ఈ డైలాగ్ ట్రైలర్లోనే విన్నాం. ఈ డైలాగ్ ఏ సందర్భంలో రావచ్చో జనాలకు ఓ అంచనా వచ్చేసింది. కట్టప్ప బాహుబలి ఎందుకు చంపి ఉంటాడో ఒక హింట్ కూడా ఇచ్చింది ఈ డైలాగ్. దీని సంగతలా వదిలేస్తే.. ప్రభాస్ పేలిపోయే డైలాగ్ ఇంకోటి చెప్పాడు. ‘‘వాడిది తప్పని తేలింది.. అందుకే తల తెగిపడింది’’.. ఇదీ ఆ రెండో డైలాగ్.

ఇది అడివి శేష్ చేసిన రుద్ర క్యారెక్టర్ని ఉద్దేశించి శివుడు చెప్పే డైలాగ్ అని అంచనా వేయొచ్చు. ‘ది బిగినింగ్’లో శివుడు.. భల్లాలదేవుడి కొడుకైన రుద్ర తల నరికేస్తాడన్న సంగతి తెలిసిందే. దీనిపై భల్లాలదేవుడు కసితో రగిలిపోతున్న సమయంలో శివుడు ఈ డైలాగ్ అనేందుకు అవకాశముంది. ఇక ప్రి రిలీజ్ ఈవెంట్లో నాజర్ మాట్లాడుతూ ఒక డైలాగ్ పరిచయం చేశాడు. ‘‘భల్లా నీకెప్పుడైనా మీ అమ్మను చంపాలని అనిపించిందా’’ అని. ఈ డైలాగ్ ఏ సందర్భంలో వస్తుందో కూడా అంచనా వేయొచ్చు. ‘ది బిగినింగ్’ చివర్లో శివగామి.. భల్లాలను కాకుండా బాహుబలిని రాజుగా ప్రకటిస్తుంది. దీనిపై భల్లాల.. బిజ్జాలదేవ ఇద్దరూ రగిలిపోతారు. ఈ క్రమంలోనే అధికార దాహంతో భార్యనే చంపించేయడానికి సిద్ధపడి.. బిజ్జాలదేవ ఆ డైలాగ్ అంటాడేమో. భల్లాల అందుకు ఒప్పుకుని.. కట్టప్ప బాహుబలిని చంపకపోతే శివగామిని బతకనివ్వబోమని బెదిరించి అతడితో ఆ పని చేయిస్తాడేమో అన్నది ఒక అంచనా.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News