బాహుబలి ది కంక్లూజన్ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. ఏప్రిల్ 28న మూవీ రిలీజ్ చేస్తామని ఎప్పుడో చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి.. అందుకు తగ్గట్లుగా పనులు చక్కబెట్టేస్తున్నాడు. రిలీజ్ కి ఇంకా 2 నెలలకు పైగా సమయం ఉన్నా.. మూవీ ప్రమోషన్స్ కీలకమైన టీజర్ ను మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు.
థియేట్రికల్ ట్రైలర్ సంగతి పక్కన పెడితే.. కనీసం టీజర్ ను కూడా విడుదల చేయకపోవడం ఆశ్చర్యకరమే. అయితే.. దీనికి గ్రాఫిక్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని.. అందుకే టీజర్ ఫైనల్ కట్ విషయంలో జక్కన్న ఇంకా చెక్కుతూనే ఉన్నాడని అంటున్నారు. అలాగని ప్రమోషన్స్ విషయంలో లేట్ అయితే.. డ్యామేజ్ జరుగుతుందనే విషయం రాజమౌళికి బాగానే తెలుసు. అందుకే టీజర్ కు బదులుగా.. వర్చువల్ రియాలిటీ వెర్షన్ అయిన ది స్వోర్డ్ బాహుబలితో ప్రమోషన్స్ కు ప్లాన్ చేశాడు జక్కన్న.
ది స్వోర్డ్ ఆఫ్ బాహుబలి టీజర్ ను తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి నుంచి ప్రదర్శించబోతున్నారు. ఇందులో వర్చువల్ రియాలిటీకి సంబంధించిన ఒక క్లిప్ ఉంటుంది. మాహిష్మతి సెట్స్ కి సంబంధించిన రియల్ టైం అనుభూతిని పొందచ్చు. ఇందు కోసం ప్రత్యేకమైన గ్లాసెస్ ధరించాల్సి ఉంటుంది. అయితే.. బాహుబలి2 పబ్లిసిటీ యాక్టివిటీస్ లో భాగంగా దీన్ని ఏపీ.. తెలంగాణల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. మరోవైపు బాహుబలి ది కంక్లూజన్ టీజర్ ను మార్చ్ 10న విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/