బాహుబలి-2 ఆడియోకు ఎంతమంది?

Update: 2017-03-26 07:11 GMT
‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆడియో వేడుకను ఎవ్వరూ ఊహించని విధంగా రామోజీ ఫిలిం సిటీలో చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ముందు అనుకున్నట్లుగా విశాఖపట్నంలో ఈ వేడుక చేస్తే అభిమానుల్ని కంట్రోల్ చేయడం కష్టమని.. అక్కడ ఎండలు ఇప్పటికే పెరిగిపోయిన నేపథ్యంలో నేపథ్యంలో జనాలు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఆ ఆలోచన మానుకున్నారు. హైదరాబాద్‌ లో అందరిలాగే శిల్ప కళా వేదికలో వేడుకను కానిచ్చేయొచ్చు కానీ.. దాని కెపాసిటీ తక్కువ. ఎక్కువమంది జనాలు వస్తే కంట్రోల్ చేయడం కష్టం. అందుకే అన్నీ ఆలోచించుకుని రామోజీ ఫిలిం సిటీలో ఈ వేడుకను చేస్తున్నారు.

అలాగని ఫిలిం సిటీ లోపల వేదిక ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే అక్కడికి అందరినీ అనుమతించారు. లోపలికి వెళ్లాలంటే టికెట్ కోసం వెయ్యి రూపాయలు పెట్టాలి. అందుకే ఫిలిం సిటీ మెయిన్ గేట్ దగ్గరే వేదిక ఏర్పాటు చేశారు. పాసులు ఉన్నవాళ్లను మాత్రమే ఇక్కడికి అనుమతిస్తున్నారు. సిటీ సెంటర్ నుంచి 30 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది కాబట్టి అక్కడికి జనాలు మరీ ఎక్కువ స్థాయిలో ఏమీ రారని.. వారిని కంట్రోల్ చేయడం పెద్ద కష్టం కాదని భావిస్తున్నారు. మొత్తంగా ఈ వేడుకకు పది వేల దాకా పాసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది రీజనబుల్ నంబరే అని భావిస్తున్నారు. కరణ్ జోహార్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న ఈ వేడుకకు బాహుబలి టీం అంతా వస్తుంది. ఈ వేడుకను 360 డిగ్రీల కోణంలో టెలికాస్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంటే వీఆర్ ఎక్విప్మెంట్ ఉంటే ఇంట్లో కూర్చునే ఆడియో వేదిక వద్ద ఉన్న అనుభూతిని పొందవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News