బాహుబలి2 అక్కడ ఆడట్లేదు!!

Update: 2017-05-01 05:30 GMT
బాహుబలి2 ఆడకపోవడమా? అదేంటి అనుకోవచ్చు కానీ.. ఇది నిజమే. దేశవ్యాప్తంగా ఎన్నెన్నో సెన్సేషన్స్ సృష్టిస్తూ.. ఇప్పట్లో ఎవరూ టచ్ చేయలేని స్థాయి రికార్డ్ వసూళ్లను సాధిస్తున్న సమయంలో.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా అనుకోవచ్చు. అయితే.. ఓవర్సీస్ లో 'బాహుబలి ది కంక్లూజన్' పెర్ఫామెన్స్ వీక్ గా ఉంది.

తెలుగు వెర్షన్ బాహుబలి2 ఓవర్సీస్ లో ఇరగదీసేస్తోంది. ఇప్పటివరకూ బాహుబలి2కి ఓవర్సీస్ లో 10.1 మిలియన్ వసూళ్లు రాగా.. ఇందులో మెజారిటీ పార్ట్ తెలుగు వెర్షన్ దే. హిందీ.. తమిళ్ వెర్షన్ లు కూడా భారీగా రిలీజ్ అయినా.. వసూళ్లు నామమాత్రంగానే ఉన్నాయి. తెలుగు వెర్షన్ కలెక్షన్స్ తో పోలిస్తే.. అసలు దరిదాపుల్లో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో హిందీ- తమిళ్ వెర్షన్స్ ను కొనుగోలు చేసిన నిర్మాతలు షాక్ తినేశారు. ఈ ఏరియా నుంచి భారీ రెవెన్యూను ఆశించగా.. కనీస మాత్రం వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి రావడం వారిని నిరుత్సాహానికి గురి చేస్తోంది.

బాహుబలి2 మూవీ ఓవర్సీస్ లో కనీసం 15 మిలియన్ డాలర్లు వసూలు చేస్తేనే సక్సెస్ అనిపించుకుంటుంది. మన కరెన్సీలో అయితే ఇది దాదాపు 100 కోట్ల రూపాయలకు సమానం. కానీ బాహుబలి2 చూపిస్తున్న జోరు చూస్తే.. ఈ మొత్తాన్ని తేలికగానే అధిగమించేస్తుందని చెప్పచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News