‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలకు ఇంకో మూడు వారాలు కూడా సమయం లేదు. ఈ సినిమా కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అభిమానులు రోజులు లెక్కిస్తూ ఉన్నారు. కన్నడ నాట కూడా జనాల్లో ఈ సినిమా చూడాలన్న ఆసక్తి తక్కువేమీ కాదు. కానీ అక్కడ ఈ సినిమా విడుదల కావడమే కష్టంగా ఉంది. ‘బాహుబలి’లో కట్టప్పగా కీలక పాత్ర పోషించిన సత్యరాజ్ కావేరీ జలాల వివాదానికి సంబంధించి గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని.. కర్ణాటకకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. లేదంటే సినిమాను కన్నడనాట రిలీజ్ చేయనివ్వబోమని తేల్చి చెప్పాయి అక్కడి సంఘాలు. ఈ విషయంలో ఒకే మాటపై ఉన్నారు కన్నడ జనాలు.
మధ్యలో చేసిన రాజీ ప్రయత్నాలేమీ ఫలించకపోవడం.. బాహుబలి-2 విడుదల రో్జునే కర్ణాటక బంద్ కు కూడా అక్కడి సంఘాలు పిలుపునివ్వడంతో బాహుబలి టీంలో గుబులు రేపుతోంది. ముఖ్యంగా ఈ చిత్ర కర్ణాటక హక్కుల్ని ఏకంగా రూ.40 కోట్లు పెట్టి కొన్న బయ్యర్ పరిస్థితి అయోమయంగా ఉంది. సత్యరాజ్ సంగతి చూస్తే.. ఆయనకు తమిళనాడు ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి ఈ వివాదం పట్టనట్లే ఉంటున్నారు. క్షమాపణ చెబితే తమిళనాట ఇమేజ్ దెబ్బ తింటుందని మౌనం పాటిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో వివాదాన్ని పరిష్కరించేదెవరో.. ఈ సినిమా సజావుగా విడుదలవుతుందో లేదో అన్న ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతోంది. మరి ఏప్రిల్ 28న ఏం జరుగుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/