ఛలో జపాన్ అంటున్న ప్రభాస్.. అనుష్క

Update: 2019-02-25 05:13 GMT
ప్రభాస్.. అనుష్క త్వరలో జపాన్ కు కలిసి వెళ్తున్నారట.   ఇద్దరూ కలిసి వెళ్తున్నారని న్యూస్ బయటకు రావడం ఆలస్యం.. వారి మధ్యలో ఏదో జరుగుతోందని.. ఇద్దరూ లవర్స్ అని రూమర్లు మొదలయ్యాయి.  ఇద్దరి మీద ఇలాంటి రూమర్స్ రావడం ఇదేమీ మొదటిసారి కాదు.. చివరిసారి కాబోదు.  అయినా ఇద్దరు జపాన్ కు ఎందుకు వెళ్తున్నారు?

'బాహుబలి' రెండు భాగాలు ఇండియాలోనే కాదు..  జపాన్లోనూ ఘన విజయం సాధించడంతో ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. దీంతో అక్కడ డార్లింగ్ సినిమాలకు డిమాండ్ ఏర్పడింది. అందుకే ప్రభాస్ నటించిన 'మిర్చి'.. 'డార్లింగ్'  సినిమాలను అక్కడ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  మార్చ్ 2 వ తారీఖున ఈ సినిమాల స్క్రీనింగ్ జరుగుతోందట.  'మిర్చి' సినిమాలో ప్రభాస్.. అనుష్కలు జంటగా నటించిన సంగతి తెలిసిందే. అందుకే ఇద్దరూ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్  కు పయనమవుతున్నారని సమాచారం.

అసలే హిట్ పెయిర్ కాబట్టి ఎక్కడ ఆ ఇద్దరూ కలిసినా.. మాట్లాడుకున్నా గుసగుసలు మొదలవుతాయి.  ప్రభాస్.. అనుష్కలు అలాంటిదేమీ లేదని ఆ రూమర్లను ఖండించినా అవిమాత్రం ఆగడం లేదు.   ఇద్దరూ పెళ్లి చేసుకుంటేగాని (ఇద్దరూ అంటే వాళ్ళిద్దరూ కాదు .. విడివిడిగా ఎవరికి వారు) ఈ రూమర్లకు అడ్డుకట్ట పడేలా లేదు.
    

Tags:    

Similar News